ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?

Jammu kashmir CM Mufti Mahabooba contraversial decision on Terrorist

భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తలు ఎప్పుడూ కనిపించే ప్రాంతం జమ్ముకాశ్మీర్. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా కానీ అక్కడి పరిస్థితి మాత్రం మారడంలేదు. అయితే అక్కడి పరిస్థితులు చక్కబడటానికి ఓ రకంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమే. అయితే తాజాగా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ భద్రతాదళాల చేతిలో హతం అయిన హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీ కుటుంబానికి 4 లక్షల నష్ట పరిహారం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ముఫ్తీ మహబూబా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి తెరతీసింది.

బుర్హాన్  వనీని ఇప్పటికే కేంద్రం ఉగ్రవాదిగా గుర్తించి, అతడిని కాల్చివెయ్యడానికి ఆదేశాలు కూడా జారీచేసింది. మరి అలాంటి ఉగ్రవాది మరణిస్తే, అతడి కుటుంబానికి ప్రభుత్వం సహాయం చెయ్యడం ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. పైగా  “అతను బుర్హాన్ వనీ అని భద్రతాదళాలకి తెలియదు. తెలిసి ఉంటే అతనిని చంపేవారు కాదు. అతనిని చంపినందుకు వారు (భద్రతాదళాలు) ప్రజలకి క్షమాపణలు చెప్పుకోవాలి అని కోరుతున్నాను’’ అని మహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించాయి.  అన్నారు. అంటే అతనిని ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వం, భద్రతాదళాలు చాలా తప్పు చేశాయని ఆమె భావిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.

కాశ్మీర్ లో మూడు నెలల క్రితం జరిగిన బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ కి నిరసనగాజరిగిన అల్లర్లలో సుమారు 110 మందికి పైగా ఆందోళనకారులు చనిపోయారు. సుమారు 2,000 మందికి పైగా గాయపడ్డారు. ఆ అల్లర్లని ఎదుర్కోలేక మహబూబా ముఫ్తీ పరుగున దిల్లీ వచ్చి కేంద్రప్రభుత్వం సహాయం అర్ధించారు. అప్పుడు కేంద్రప్రభుత్వం అతికష్టం మీద అల్లర్లని అదుపు చేయగలిగింది.  రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోగానే, ముఖ్యమంత్రి ముఫ్తీ మళ్ళీ వేర్పాటువాదులకి, తీవ్రవాదులకి వంత పాడటం మొదలుపెట్టినట్లున్నారు. వేర్పాటువాదులకు నేరుగా తన మద్దతు ఇవ్వకపోయినా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వారికి నైతికంగా మద్దతు ప్రకటించేశారు. అయినా బుద్దిలేకుండా ఓ సిఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడ ఏంటి అని అనుకునే వాళ్లు అనుకుంటున్నారు. అన్నింటికి మించి దేశభక్తి అంటూ గుండెలు చించుకుంటున్న బిజెపి పార్టీ ఇంత మాట అన్న తర్వాత కూడా అధికార పీడీపీ పార్టీకి ఎందుకు మద్దతునిస్తుందో మరి.. దీనికి ఏ పేరు పెట్టాలో మరి.

Related posts:
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
వీళ్లకు ఏమైంది..?
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
స్టే ఎలా వచ్చిందంటే..
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
500 నోటుపై ఫోటో మార్చాలంట
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments