జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)

Janasena a divion of Telugudesamparty

జనసేన 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి అంటూ స్థాపించిన ఓ పార్టీ. జనసేన పార్టీని స్థాపించినా కానీ ఎలాంటి మేనిఫెస్టో లేకుండా ఎలాంటి లక్ష్యాలు లేకుండా కేవలం ఒక వ్యక్తి తప్ప మరో మనిషి లేని పార్టీ జనసేన. అలాంటి జనసేన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి డివిజన్ గా పని చేస్తోంది. ఓ వింగ్ ఎలాగైతే పార్టీకి సపోర్ట్ గా పని చేస్తుందో జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే పనిచేస్తోంది. పవన్ కల్యాణ్ తీరుతో జనసేన అనేపార్టీని, తెలుగుదేశం పార్టీని ఎవరూ వేరేవేరుగా చూడటం లేదు. 2014 ఎన్నికల్లో పవన్ పూర్తిగా టిడిపి కోసమే పనిచేశాడు.

ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ గ‌ళ‌మిప్పారు. అనాల్సిన‌వ‌న్నీ మొన్న తిరుప‌తి స‌భ‌లోనే అనేశారు. తిట్టాల్సిన వాళ్ల‌నంతా తిట్టిపారేశారు. ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా… ఎవ‌రికీ మిన‌హాయింపులు ఇవ్వ‌కుండా అంద‌రినీ ఉతికి ఆరేశారు. మ‌ళ్లీ ఓ రెండు వారాలాగి వ‌స్తానంటూ హెచ్చ‌రిక కూడా చేశారు. సెప్టెంబ‌ర్ తొమ్మిదిన కాకినాడ‌కు వ‌స్తానంటూ తేదీ వేదిక చెప్పారు. మ‌రి అప్ప‌డొచ్చి ఏం మాట్లాడ‌తారు. నిన్న తిట్టిన‌ట్లే మ‌ళ్లీ అదే రికార్డును తిరిగి ప్లే చేస్తే వినేదెవ‌రు? అప్పుడు ప‌వ‌న్ ఇబ్బంది ప‌డ‌తారు క‌దా!

అందుకే ప‌వ‌న్ ఇబ్బంది ప‌డ‌కుండా చూసుకోవాల‌నే టీడీపీ నేత‌లు రంగంలోకి దిగారు. ఎంపీలు జేసీ, అవంతి, రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ ఇలా ఒక్కొక్క‌రు బ‌య‌టికొచ్చి ప‌వ‌న్‌ను తిట్టిపోస్తున్నారు. స‌వాళ్లు విసురుతున్నారు. త‌ద్వారా రేపొద్దున ప‌వ‌న్కు టార్గెట్‌గా మారుతున్నారు. అంటే ఈసారి వేదిక ఎక్కే ప‌వ‌న్‌కు విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి వీళ్లే అవ‌కాశం ఇస్తున్నార‌న్న మాట‌. ప‌వ‌న్ తిడితే ప‌వ‌న్ కూడా ఇవ‌న్నీ లెక్క రాసుకుని పుస్త‌కంలో రాసుకుని వ‌చ్చి తిరిగి బ‌దులిస్తారు.

రేపొద్దున ప‌వ‌న్ స‌భ‌కు స్క్రిప్ట్‌కు అవ‌స‌ర‌మైన ఇన్‌పుట్‌ను అందించేందుకే వీళ్లంంతా ఇలా అత‌డిపై విరుచుకుప‌డుతున్నారేమో అనిపిస్తుంది. లేకుంటే… టీడీపీ అధినేత నేరుగా స్పందించారు. పార్టీ అధికార ప్ర‌తినిధులు పార్టీ వైఖ‌రిని వెల్ల‌డించారు. ప‌వ‌న్ చేస్తున్న పోరాటం మంచిదేన‌ని దానికి తాము మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా పవన్ మీద రెండు రకాల ప్రకటనచెయ్యడం ద్వారా ఓ పక్కన ప్రజలను మోసం చేస్తూ.. వారి సమస్యలను తప్పుదోవపట్టిస్తున్నారు. అదేటైంలో అధికారపక్షం చేస్తున్న ప్రతిపక్షాల బారి నుండి కూడా మీడియా దృష్టిని మరల్చవచ్చు. పవన్ కళ్యాణ్ కనిపించకుండా పచ్చకండువా కప్పుకున్న టిడిపి నాయకుడు అని అందరూ అనుకుంటున్నారు.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
పవన్ ను కదిలించిన వినోద్
ఉక్కిరిబిక్కిరి
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఎవరు చాణిక్యులు..?
మద్యల నీ గోలేంది..?
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
తొక్కితే తాటతీస్తారు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
పిట్టల దొరను మించిన మాటల దొర
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
జయలలిత జీవిత విశేషాలు
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments