కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ

nehru-in-Kashmir-Conflict

Jawahar lal Nehru is the real reason for Kashmir Conflict. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

కాశ్మీర్ విషయంలో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పులను ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. కాశ్మీర్ లో జరుగుతున్న హింసకు నెహ్రూ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణం అంటే కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోరేమో. కానీ అది వందకు వంద శాతం నిజం. కాశ్మీర్ అంశంలో కాశ్మీర్ రాజు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నా కూడా నెహ్రూలోని అపరిచితుడు చేసిన అతి వల్ల ఇప్పటికి అగ్గిరగులుతూనే ఉంది. నెహ్రూ క్షమించరాని తప్పులు చేశాడు. ఆ తప్పులు..

గమనిక: ఈ నిజాలు నమ్మడానికి కాస్త చేదుగా ఉంటాయి. కానీ నిజాలను ఎన్నటికీ దాచలేం. నెహ్రూ మీద ఎలాంటి ద్వేషంతో రాసింది కాదు.

షేక్ అబ్దుల్లాతో స్నేహం:
నెహ్రూ, షేక్ అబ్దుల్లా మంచి మిత్రులు. నెహ్రుకు అబ్దుల్లా ఏమంటే అది. కాగా కాశ్మీర్ రాజ్యం విముక్తి కోసం అంతకు ముందు క్విట్ కాశ్మీర్ పేరుతో 1946లో ఉద్యమించాడు షేక్ అబ్దుల్లా. అయితే షేక్ అబ్దుల్లాను పలకరించేందుకు జైలుకు వెళుతుంటే రాజుగారి సైన్యం నెహ్రూను అడ్డుకున్నాయి. నిజానికి ఇది రాజుకు తెలిసి జరిగింది కాదు. కానీ దీన్ని నెహ్రూ మాత్రం అవమానంగా భావించాడు. దాంతో పాకిస్థాన్ యుద్దానికి వస్తున్న టైంలో నెహ్రూ అబ్దుల్లాకు కాశ్మీర్ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నాడే కానీ భారత్ లో విలీనం చేసుకోవాలని అనుకోలేదు.

Nehru-with-Abdullah

నెహ్రూకే కాదు.. భారత్ కు ద్రోహం చేసిన షేక్ అబ్దుల్లా:
భారతదేశంలో ఉంటూ అప్పట్లోనే రాజకీయం చేసి భారత్ కు ద్రోహం చేసిన వాడు షేక్ అబ్దుల్లా. నెహ్రూతో ఎంతో స్నేహం చేసినా చివరకు దేశానికే ద్రోహం చేశాడు అబ్దుల్లా. అవినీతికి పాల్పడటంతో పాటు, పాక్ తో యుద్దం టైంలో భారత సైన్యానికి తప్పుడు సూచనలు చేశాడు.ఓ రకంగా పాకిస్థాన్ కు మద్దతుపలికాడు. దాంతో అతడిని అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్లను నమ్మి నెహ్రూ కాశ్మీర్ రాజు విషయంలో, కాశ్మీర్ పై తప్పుడు ఆలోచనలు చరిత్రలో నిలిచిపోయాయి.

Adullah-arrested

సైన్యానికి అనుమతివ్వని నెహ్రూ:
నాడు ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మన సైన్యం పాకిస్థాన్ తో భీకర యుద్దానికి దిగింది. 21, 22 అక్టోబర్ 1947లో దాదాపుగా ఐదు వేల మంది పాకిస్థాన్ సైన్యాన్ని కాశ్మీర్ భూభాగం నుండి వెనక్కి పంపించింది. దాదాపుగా అన్ని మేజర్ ఏరియాల్లో భారత సైన్యం పైచేయి సాధించింది అనుకుంటున్న టైంలో బారామతిని కూడా భారత సైన్యం శ్రీనగర్ మీద యుద్దం ప్రభావం లేకుండా సొంతం చేసుకుంది. ఇలాంటి టైంలో సైన్యానికి ఎలాంటి ఉత్వర్వులు జారీ చెయ్యలేదు. పైగా ఈ అంశాన్ని అనవసరంగా యుఎన్(ఐక్యరాజ్య సమితిలో) పెట్టాడు.

Indian-Army-Fight

నెహ్రూ ఐక్యరాజ్య సమితికి వెళ్లడం:
కాశ్మీర్ లో మన సైనికులు వీరోచితంగా పోరాడుతుంటే నెహ్రూ మాత్రం ఐక్యరాజ్య సమితికి వెళ్లి దీన్ని పెద్ద ఇష్యూగా చూపించారు. దాంతో దీన్ని అంతర్జాతీయ సమస్యగా యుఎన్ ప్రకటించింది. దాంతో రెండు దేశాలు 1948 జనవరి 1 తేది నుండి కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇది నెహ్రూ తనకు తెలిసి చేసిన అతి పెద్ద తప్పు.

Kashmir-in-UN

బ్రిటిష్ వాళ్లను నమ్మిన నెహ్రూ:
భారత్ లో విలీనం కాని అన్ని రాజ్యాలను నాటి హోంమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ డీల్ చేశారు. దాంతో అన్ని రాజ్యాలు వేరే ఆప్షన్ లేనట్లు కలిసిపోయాయి. కానీ కాశ్మీర్ విషయంలో మాత్రం నెహ్రూ ఉన్నాడు. కాశ్మీర్ ను భారత్ లో ఎలా కలుపుకోవాలని బ్రిటిష్ వాళ్లతో చర్చించాడు. మౌంట్ బాటన్ తో సహా అందరితో దీని గురించి చర్చించాడు. వాళ్లు మాత్రం పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తూ.. గిల్గిట్- బాలస్తియన్ రీజియన్ వరకు పాకిస్థాన్ ఆర్మీ వచ్చేలా చేశారు. మన వాళ్లతో కాకుండా నెహ్రూ బ్రిటిష్ వాళ్లతో చర్చించడం పెద్ద తప్పు.

Nehru-with-British

జమ్ము కాశ్మీర్ జుట్టును కాశ్మీర్ చేతిలో పెట్టిన నెహ్రూ:
భారత ప్రభుత్వం అప్పుడు తీసుకున్న వ్యవస్థాగత నిర్ణయం చాలా ద్రోహం చేసింది. ఆనాడు భారత ప్రభుత్వం అసెంబ్లీ స్థానాలను జనాభా ప్రాతిపదికన, ఏరియా ప్రాతిపదికన కాకుండా గుడ్డిగా ఇచ్చింది. దాంతో ఇప్పటికీ కూడా జమ్ము కాశ్మీర్ లో ఎలాంటి నిర్ణయం పర్ ఫెక్ట్ గా రావడం లేదు. ఆర్టికల్ 370తో సహా అన్ని దీనికి పర్యవసనాలే. కాశ్మీర్ రీజియన్ కు 46 సీట్లు, జమ్ముకు 37 సీట్లు, లడఖ్ కు 4 సీట్లు కేటాయించారు. దాంతో కాశ్మీర్ వ్యాలీతో సహా పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ మద్దతుదారులు పాకిస్థాన్ కు అనుకూలంగా అన్ని నిర్ణయాలను తీసుకుంటున్నారు.

seats

రాజకీయ ప్రయోజనాల కోసం కాశ్మీర్ ను వాడుకున్న నెహ్రూ:
నెహ్రూ ఓ హిట్లర్ లాగా ప్రవర్తించాడని అనిపిస్తోంది. కాబట్టే తన పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలని, వాళ్లే అధికారం చెలాయించాలని అనుకున్నాడు. అందుకే రాజకీయాలు చేసి చివరకు కాశ్మీర్ కు ద్రోహం చేశాడు. 75 సీట్ల జమ్ము కాశ్మీర్ లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు 75 సీట్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ తర్వాత ఎలక్షన్ లో మాత్రం నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 73 మంది గెలువగా. రెండింటిలో మాత్రం వేరే అభ్యర్థులు మాత్రం నేషనల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. దాన్ని తెలుసుకున్న నెహ్రూ ఏకంగా వాళ్లను బెదిరించి మరీ విత్ డ్రా చేయించారు. అక్కడి నుండి కాశ్మీర్ ను రాజకీయంగా వాడుకోవడం మొదలైంది.

Indian-Fighters

ఆర్టికల్ 370కి పునాది వేస్తూ ఆర్టికల్ 306A తెచ్చిన నెహ్రూ:
నెహ్రూ కాశ్మీర్ లో ఆర్టికల్ 306ఎను తీసుకురావాలని అనుకున్నాడు. అందుకు అంబేద్కర్ దగ్గరకు దీని గురించి వ్యక్తిని పంపితే ఆయన కాశ్మీర్ ను భారత్ లో భాగంగా కాకుండా ఎందుకు వేరుగా చూస్తున్నారు..? భారతీయులకు కాశ్మీర్ లొ మామూలుగా జీవించడానికి ఎందుకు వీలులేకుండా చేస్తున్నారు..? నేను న్యాయశాఖ మంత్రిని నేను దీనికి అంగీకరించను అని అన్నాడు. దాంతో నెహ్రూ తన కుతంత్రాన్ని వాడి గోపాలస్వామి అయ్యంగార్ తో దొంగచాటుగా ఆర్టికల్ బిల్ ను పార్లమెంట్ లో పెట్టించి.. పాస్ చేయించారు. ఇది నిజంగా భారత చరిత్రలో ఎన్నడూ కూడా జరగని అతి పెద్ద కుట్ర.

Amberdkar

ఆర్టికల్ 370 అంటే ఏమిటి…? కాశ్మీర్ లో అది ఎలా పని చేస్తుంది..? అనే అంశాలను ఐదో భాగంలో తెలుసుకుందాం.

  • అభినవచారి

Also Read:

కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు (మూడో భాగం)

పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ.. (రెండో భాగం)

కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది (మొదటి భాగం)

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ఇదే జగ‘నిజం’
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
టాప్ గేర్ లో ముద్రగడ
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మద్యల నీ గోలేంది..?
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
చెత్త టీంతో చంద్రబాబు
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
పిట్టల దొరను మించిన మాటల దొర
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

Comments

comments