శోభన్ బాబుతో జయ ఇలా..

Jayalalalitha's happy movemonets with Shobhan Babu

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరమపదించారు. అయితే జయలలిత సినీ, రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. నాడు జయలలిత సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు ఎంజీఆర్ కంటే ముందు శోభన్ బాబుతో జయ సన్నిహితంగా ఉండటంపై అప్పట్లో ఎన్నో పుకార్లు వచ్చాయి. ‘డాక్టర్‌ బాబు’ సినిమా తో శోభన్‌బాబు జయలలితల మద్య  స్నేహ బంధం మొదలై మంచి అనుబంధంగా మిగిలింది. వీరిద్దరూ కలసి నటించిన ఒకే ఒక్క చిత్రం ఇది. శోభనబాబు ‘స్ర్కీన్‌ప్లే’ సినీ మాసపత్రికలో ‘నేనూ – నా కథానాయికలు’ అనే శీర్షికన రాసిన వ్యాసంలో జయలలిత గురంచి రాసారు.‘డాక్టర్‌ బాబు’ షూటింగ్‌ నిమిత్తం ఊటీలో వాళ్ళిద్దరి తొలి పరిచయం జరిగిందని తెలిపారు. పరిచయం అయిన రెండు రోజులు తరవాత జయ శోభన్‌బాబుతో స్వయంగా ఇలా… ‘‘చెప్పలేనంత దిగులుతో నిండి బరువైపోయిన నా మనసును మీ జోక్స్ తో తేలిక చేశారు.

ప్రపంచం అంతా మళ్లీ చాలా సాధారంగా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలనీ, కలిసిపోవాలనీ, నవ్వుకుని నవ్వించాలని, నవ్వించి నవ్వుకోవాలనీ, ఎప్పుడూ ఇలాగే తేలికైన మనసుతో తేలిపోవాలనీ, ఏమిటేమిటో, మొన్నటి వరకూ చాలనిపించిన ఈ బ్రతుకు నిన్నటి నుంచీ చాలదనిపిస్తున్నది! అమ్మ పోయిన తరవాత నా అన్నవారు లేక, అన్నీ ఉన్నా ఏమీ లేనిదానిలా నా జీవితం అనిపిస్తుందని, ఎవరైనా బందువులమంటూ దరి చేరినా కేవలం డబ్బు కోసమే దగ్గరకి వస్తారని, ఎవ్వరిని నమ్మలేని స్థితిలో ఉన్నానని అన్నాదంట జయ.

అందుకే అందరికి దూరంగా లంకంత ఇంట్లో ఒంటరిగా బ్రతుకుతున్న నాకు, ఒంటరిదానిగా మిగిలిపోతానేమోననే బెంగతో కుంగిపోతున్న నాకు నిన్నటి నుంచీ ప్రాణం లేచివచ్చినట్లనిపిస్తున్నది. మీతో మాట్లాడుతున్నంత సేపూ పోయిన మా అమ్మలోని ఆత్మీయత మళ్లీ చవిచూస్తున్నట్టుంది. మా అమ్మ పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉండేదో, మీరున్నంత సేపూ అంత ధైర్యంగా ఉంది. మీరు వేసే ప్రతి జోక్‌కి నా మనసెంత తేలికైపోతున్నదో, నేనెంత తేలిపోతున్నానో మీకు చెప్పలేను’’ అని జయలలిత అన్నదని  శోభన్‌బాబు వ్రాసారు. దీన్ని బట్టి శోభన్ బాబు, జయలలితల మధ్య స్నేహం ఎలా ఉండేదో అర్థమవుతుంది.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
అమ్మకు ఏమైంది?
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నారా వారి అతి తెలివి
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
దివీస్ పై జగన్ కన్నెర్ర
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
వార్దాకు వణికిపోతున్న చెన్నై
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments