జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?

Jayalalitha died by poisoning

తమిళనాడు అమ్మ, దివంగత ముఖ్యమంత్రి జయలలితపై విష ప్రయోగం జరిగిందా? అనే ప్రశ్న రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికే  ఏఐడిఎంకె పార్టీకి ఎవరు బాధ్యతలు తీసుకుంటారో అనే డైలమాలో మరోసారి జయలలిత మీద విషప్రయోగం అనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. దాదాపుగా 75 రోజుల చికిత్స తర్వాత జయలలిత మరణించినట్లు చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా జయలలిత విషప్రయోగం ద్వారానే మరణించింది అని అన్నాడిఎంకె పార్టీకి చెందిన సుప్రీంకోర్టు లాయర్ ఆర్. కృష్ణమూర్తి గతంలో ఆరోపించారు. కాగా మరో వ్యక్తి కూడా అదే ఆరోపణలు చెయ్యడం వార్తల్లో నిలుస్తోంది.

జయలలితకు ఎంతో నమ్మకంగా ఉన్న శిహాన్ హుస్సేని కూడా అమ్మ మీద విష ప్రయోగం జరిగింది అని ఆరోపించారు. జయలలితను మర్డర్ చేశారు అని అందరికి తెలుసునని ఆయన అన్నారు. జయలలిత మీద విషప్రయోగం జరిగిందని, ఆమె పార్థివ దేహానికి పరీక్షలు చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి అని ఆయన వాదిస్తున్నారు. మరోపక్క ఏఐడీఎంకే పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం చేపట్టడం మంచిదే అని ఆయన అన్నారు. మొత్తానికి జయలలిత మృతి తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణల్లో విషప్రయోగం కూడా ఒకటి. ఆమె పార్థివ దేహం బుగ్గపై మూడు రంధ్రాలు ఉన్న ఫోటో కూడా గతంలో హల్ చల్ చేసింది.

Related posts:
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
గుజరాత్ సిఎం రాజీనామా
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
అమ్మకు ఏమైంది?
బాబు బండారం బయటపడింది
ఏపీకి ఆ అర్హత లేదా?
వంద, యాభై నోట్లు ఉంటాయా?
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
తెలంగాణ 3300 కోట్లు పాయె
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
గాలిలో విమానం.. అందులో సిఎం
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
బాబును వదిలేదిలేదు
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
దేశభక్తి అంటే ఇదేనా?
అందుకే భూకంపం రాలేదట
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments