16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా

Jayalalitha wrote her will before sixteen years

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద అనేక అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఆమె మరణం తర్వాత అందరికి వచ్చిన మొదటి ప్రశ్న.. ఆమె తర్వాత ఎవరు అని. రెండో ప్రశ్న జయలలిత ఆస్తులు ఎవరికి చెందుతాయి? అనేది. అసలు ఆమె తన ఆస్తులను ఏం చేయాలనుకున్నారు ? తన వారసురాలిగా ఎవరిని నిర్ణయించారు ? అసలు వీలునామా రాశారా ? లేదా ? అన్న లోసుగులు వీడుతున్నట్లు కనబడుతోంది.

జయలలిత తాను ఎప్పుడో 16 ఏళ్ల కిందటనే తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్‌ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్‌ చేయించినట్టు సమాచారం. వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్‌ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్‌ హెయిర్‌)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు వీలు కాదని పేర్కొంటున్నారు. తనకు ఉన్న వెసులుబాటుతో ప్రైవేటు అటెండెన్స్ ద్వారా ఈ తంతు పూర్తి చేయించినట్టు విశ్వసనీయ సమాచారం.

అయితే అప్పట్లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్ స్వయంగా జేజే గార్డెన్స్ కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జూలై 14, 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సమయంలో జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్టుల రిజిస్ట్రేషన్ ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్ లో తన గార్డెన్స్ ఉన్న పేట్ బషీరాబాద్ అడ్రస్ తో చేయించారు. ‘పురుచ్చి తలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్, నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్’ల నిర్వాహకురాలిగా జయ తన పేరుతోపాటు శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను రిజిస్ట్రేషన్ సమయంలో చేర్చారు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
బతుకు బస్టాండ్ అంటే ఇదే
అమెరికా ఏమంటోంది?
బాబుకు గడ్డి పెడదాం
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments