జయను ఎందుకు ఖననం చేశారంటే?

Jayalalithaa body buried why not cremated

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చెన్నైలోని మెరీనా బీచ్ లో ఏర్పాటు చేసిన స్థలంలో, ఎంజీఆర్ పక్కనే ఖననం చేశారు. అయితే జయలలితను నిజానికి బ్రాహ్మణ అయ్యంగార్  సంప్రదాయాల ప్రకారం దహనం చేయాల్సి ఉండగా, సంప్రదాయానికి విరుద్ధంగా ఖననం చేశారు. అయితే జయలలితను అందరూ ఊహించినట్లు కాకుండా ఖననం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అందులో కొన్నింటిపైన అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అందులో అసలు కారణాలు ఏంటో మీరు కూడా చూడండి.

కారణం 1:
జయలలిత బ్రాహ్మణ అయ్యంగార్ సంప్రదాయం ప్రకారం ఆమెను దహనం చెయ్యాల్సి ఉంది. కానీ ఆమెకు పెళ్లికాలేదు కాబట్టి ఆమెను ఖననం చేశారు అనేది ఓ వాదన.

కారణం2:
తమిళనాట జయలలిత అక్కడ అమ్మగా ఎంతో మంది గుండెల్లో పాతుకుపోయింది. ఎంతో మందికి ఆమె ఆరాధ్యదైవంతో సమానం. అయితే దహనం చేసే కన్నా ఖననం చేస్తే ఆమెకు ఓ రకంగా దైవత్వాన్ని ఆపాదించడం కుదురుతుందని అనుకున్నట్లు తెలుస్తోంది.

కారణం3:
ఎంజీఆర్ ను ఎలాగైతే ఖననం చేశారో తనను కూడా అలాగే ఖననం చేయాలని జయలలిత ముందు నుండి చెప్పుకొచ్చారని, కాబట్టి ఆమె కోరికమేరకు ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేశారని వార్త.

కారణం4:
వ్య‌క్తిగ‌తంగా జ‌య బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందిన వారైనా పార్టీ ప్ర‌కారం ఆమెకు కులం లేదు, మ‌తం లేదు, అంద‌రికీ అమ్మ ఒక‌టే. అందుకే ఆమె దేహాన్ని పూడ్చి పెడుతున్నారు. ఇక చివ‌ర‌గా ఇంకో కార‌ణ‌మేమిటంటే… జ‌య మృత‌దేహాన్ని ద‌హ‌నం చేయ‌డానికి త‌ల‌కొరివి పెట్టే ఎవ‌రో ఒక‌రు ఆమె ర‌క్త సంబంధీకులు ఉండాలి. (నిజానికి ఉన్నా కానీ ఆమె ఎన్నడూ వారిని గుర్తించలేదు)దీంతో జ‌య మృత‌దేహాన్ని ద‌హ‌నం కాకుండా ఖననం చేశారని తెలుస్తోంది.

కారణాలు ఏవైనా కానీ జయలలితను ఖననం చెయ్యడం మీద ఆ టైంలో అక్కడున్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించిందని, ఫలితంగా ఇది సంప్రదాయానికి విరుద్ధం అని గుసగుసలాడుకున్నారట. ఏది ఏమైనా ఆ తంతు ముగిసింది.

Related posts:
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ఇదే జగ‘నిజం’
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
వెనకడుగు
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
మద్యల నీ గోలేంది..?
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
చెత్త టీంతో చంద్రబాబు
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
మీకో దండం.. ఏం జరుగుతోంది?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments