జయలలిత జీవిత విశేషాలు

Jayalalithaa's life journey from the begining

తమిళ‌నాట ఆమె తిరుగులేని క‌ధానాయికి. రాజ‌కీయ‌రంగంలో ఇక త‌న‌కు తానే సాటి. ఆమే అమ్మ జ‌య‌ల‌లిత‌. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత  ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. జయలలిత పెద్దలు మైసూర్ లో బాగా బ్రతికారు. పుట్టుడం బాగా ధనిక కుటుంబంలో పుట్టినా కానీ జయలలిత తల్లితండ్రులు జయకు జన్మనిచ్చే టైంకు ఆ కుటుంబం నిరుపేద కుటుంబంగా మారింది. జయలలిత తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.

jaya-childhood

జయలలిత తల్లి వేదవతి సినిమా నటి. వేదవతి సోదరి కూడా సినిమా యాక్టరే. ఓసారి సినిమా వాళ్లు ఆమె ఇంటికి వచ్చి.. అక్కడ జయను చూసి సినిమాల్లో నటించేందుకు ఒప్పించారు. కుటుంబ పరిస్థితులవలన  ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా ” చిన్నడ గొంబె కన్నడ ” చిత్రము పెద్ద హిట్టయ్యింది.  ఈమె తొలి తెలుగు సినిమా ” మనుషులు మమతలు  ఆమెను పెద్ద తార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతోసత్కరించింది. రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసిన చేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు జ‌య‌ల‌లిత ఏలారు.

jaya-in-young-age

ఇక చిన్నప్పటి నుండి జయలలిత చదువులో ఎప్పుడూ టాపే. అయితే ఆమె యాక్టర్ గా ఉన్న టైంలో కూడా ఏదో ఒక ఇంగ్లీష్ నవల చదువుతూనే ఉండేది. కాగా యాక్టర్ గా మంచి ఫాంలో ఉండగా.. ఎంజీఆర్ ప్రోద్భలంతో 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు.  1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ కు, జయలలితకు మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత జానకి రామచంద్రన్ తో విభేదించారు జయ. కొంత కాలానికి తిరిగి ఒకే దగ్గరికి, జయ నాయకత్వంలో పనిచేశారు జానకి.

jaya-in-films

తమినాడు  సీఎం జయలలిత జీవితం ఓ సాహసం. అందుకే ఆమె దేశ వ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నారు. పాక్ మీడియా సైతం ఆమె ఆరోగ్యంపై విభిన్న కథనాల్ని  ప్రచారం చేసింది. అయితే జయలలిత ప్రజలకు దేవతగా ..ప్రత్యర్థులకు అహంభావిగా కనిపించే తీరుపై పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జయలలితకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. అందులోనూ పురాణగాథలంటే మరీ ఇష్టం. తన జీవితంలో ఏదైనా సంఘటన జరిగితే పురాణగాథలు ద్వారా తనను తాను అన్వయించి చూసుకునేవారు. అలా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి మహాభారత ఘటనతో పోలుస్తూ ఆమే ఓసారి చెప్పారు.

jaya-in-assembly

మార్చి 25 1989 లో జరిగిన ఓ సంఘటనే జయను ఇలా మకుటంలేని మహరాణిలా తీర్చిదిద్దిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో జరిగే సమయంలో ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే నేతలు జయ చీరలాగి, ఆమె జుట్టుపట్టుకొని దాడి చేసి ఘోరంగా అవమానించారు. ఆ సమయంలో అగ్ని కణాల్లాంటి కళ్లతో దెబ్బతిన్నపులిలా  మళ్లీ అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ హుంకరిస్తూ వెళ్లారు. ఆ సంఘటనతో నే ద్రౌపదీవస్త్రాభరణంలో  భీముడికి ఉన్న ఆవేశం నాలో కూడా వచ్చింది. నేను ఆ ఆవేశాన్ని నియంత్రించుకుని, నన్ను అవమానించిన వారిని పదవి నుంచి తొలగించేలా న్యాయపోరాటం చేయడానికి ప్రణాళికతో వాడుకున్నాను’ అని చెప్పారు జయ.

jaya-speech

2011,  2016 సంవ‌త్స‌రాల‌లో  విజయం సాధించి తమిళ నాట త‌న‌కు ఎదురులేద‌ని నిరూపించుకున్నారు. అయితే సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల ఆరాధ్య‌దైవంగా త‌న‌దైన శైలిలో రాజ‌కీయాల‌ను సాగిస్తున్నారు. అయితే అనారోగ్యం ఆమెను బాగా కుంగ‌దసింది.సుమారు రెండున్న‌ర నెల‌లుపాటు జ‌య‌ల‌లిత ఆసుప‌త్రికే ప‌రిమిత‌మ‌య్యారు.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా లాభాలు
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
మెరుపు దాడి... నిజమా-కాదా?
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పిట్టల దొరను మించిన మాటల దొర
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments