బాబు ఏమన్నా గాంధీనా?

JC Dewakar Reddy told Chandrababu Naidu is not Gandhi

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూటిగా మాట్లాడే దివాకర్ రెడ్డి ఈసారి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చెయ్యడం అందునా.. బాబుగారి సభలకు వచ్చే జనాల గురించి ప్రస్తావించడం తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ముందు నుండి ఊహించినట్లు జేసీ దివాకర్ రెడ్డి ఓ పెద్ద బాంబే పేల్చాడు. ఇప్పుడు అంతా జేసీ చేసిన వ్యాఖ్యల మీదే చర్చ జరుపుతున్నారు. అయినా ఇంతలా చర్చించడానికి జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడారు? అనేగా మీ సందేహం అయితే మొత్తం ఆర్టికల్ చదవండి.

‘‘కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదు . పిలిస్తే జనం వచ్చేయడానికి చంద్రబాబు గాంధీ మహాత్ముడు కాదు. చంద్రబాబు ఆఫీసర్లతో పాలన కొనసాగిస్తున్నారు , గతంలో అలా చేసే దెబ్బ తిన్నారు. ఇప్పటికైనా సీఎం తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆఫీసర్ల రాజ్యం వద్దని బాబుకు చాలాసార్లు చెప్పాను . ఎమ్మెల్యేల మాటలు ఎవరు వినడం లేదు. పయ్యావుల కేశవ్ లాంటి నాయకులకే పార్టీలో గుర్తింపు లేకపోతే తమ వంటి వాళ్ల పరిస్థితి ఏమిటి ?’’ అని జేసీ అన్నారు.

మొత్తం మీద  ఎంపీ జేసీ వ్యాఖ్యలు పార్టీలో గుబులు రేపుతున్నాయి.  జేసీ పార్టీ మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌-రెడ్డి, ప్రభాకర్‌ చౌదరి మధ్య వివాదాలు భగ్గుమంటున్నాయి.  తాజాగా జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై   ప్రభాకర్‌ చౌదరి ముఖ్య అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని  ఆస్తుల విధ్వంసానికి పాల్పడతామని హెచ్చరిస్తున్నారని డిప్యూటీ మేయర్‌ గంపన్న  ఫిర్యాదు సారాంశం. జేసీ సోదరుల బెదిరింపుల వ్యవహారం చంద్రబాబుకు  దృష్టికి కూడా వచ్చింది. కాగా టీడీపీ నేత ప్రభాకర్ చౌదరికి  కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన జేసీ బ్రదర్స్ కి మధ్య అధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అనే సూచనలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments