ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్

Jio, Airtel, Telecom

న్యూఇయర్ దగ్గర పడుతుండడంతో టెలికాం కంపెనీ అలర్టయ్యాయి. రకరకాల ప్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. లేటెస్ట్ గా జియో మరో అడుగు ముందుకేయనుంది. ఉచిత కాల్స్ , ఉచిత డేటా సౌకర్యంతో కస్టమర్స్ కి చేరువైన జియో, ఈ సేవలన్నీ ఇప్పటివరకు 4జీ ఫోన్లలో మాత్రమే! తాజాగా జియో సిమ్ లు 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా ఆ సంస్థ ఓ యాప్ ను రూపొందించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల చివర లేదా వచ్చేనెలలో ఆ యాప్ ని అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1న నుంచి ‘హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. రాబోయే 3జీ జియో సిమ్ ద్వారా కస్టమర్లు పెరిగే ఛాన్స్ వుందని అప్పుడే లెక్కల్లో నిమగ్నమైంది ఆ కంపెనీ.

మరోవైపు జియో దెబ్బకు తన పాత విధానాలను సడలిస్తోంది ఎయిర్ టెల్. ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు తొలి మూడునెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపారు. 10 జీబీ కలిగిన బేసిక్ ప్లాన్ రూ. 599లతో ప్రారంభం అవుతుందని, అలాగే రూ. 1,299 ల రెంటల్ తో నెలకు 60 జీబీ డేటా ప్లాన్ ను తీసుకునేవారికి ఉచిత అపరిమిత కాలింగ్ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఆ ఆఫర్ ముంబైలో ఉంటున్న కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే తమకు 3.51 లక్షల ఫిక్స్ డ్ లైన్ కస్టమర్లున్నారని, వీరిలో ఎక్కువశాతం ఎంటర్ ప్రైజెస్ వినియోగదారులేనట. వి-ఫైబర్ టెక్నాలజీ ఆధారంగా ఫిక్స్ లైన్ ఫోన్లతో అధిక వేగంతో కూడిన డేటా కనెక్టివిటీని అందించే విధంగా నెట్ వర్క్ ను అప్ గ్రేడ్ చేసింది ఎయిర్ టెల్. దీనిద్వారా 100 ఎంబిపిఎస్ వరకు వేగంతో డేటాను అందించనుంది.

Related posts:
ఆయనకు వంద మంది భార్యలు
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
సింగ్ ఈజ్ కింగ్
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
బాబు బిత్తరపోవాల్సిందే..
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
ఆయన మాట్లాడితే భూకంపం
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments