జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..

Jio

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని చేసిన సంచలన ప్రకటనతో స్టాక్ మార్కెట్ భారీ కుదుపులకు లోనైంది. ముఖ్యంగా టెలికాంలో దిగ్గజ కంపనీలకు భారీ దెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ లో వాటి షేర్ల విలువ గణనీయంగా పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42 వార్షిక సమావేశంలో సంస్థ అధినేత ముఖేష్ అంబాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కలగంటున్న డిజిటల్ ఇండియాను రిలయన్స్ జియో నిజం చేస్తుందని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ప్రపంచంలో 150వ స్థానంలో ఉందని, రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టాప్ 10లో చోటు దక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 5 నుండి జియో సేవలు ప్రారంభం కానున్నాయని, డిసెంబర్ 31 నుండి అన్ని సేవలు ఉచితం అని ముఖేష్ అంబాని తెలిపారు. డేటా ఇజ్ ది ఆక్సిజన్ అఫ్ ది డిజిటల్ లైఫ్ అని, దేశంలో ప్రతి వినియోగదారుడిని లక్ష్యంగా చేసుకున్నామని, విద్యార్థులకు 50 శాతం అదనంగా ఇంటర్నెట్ అందించనున్నట్లు తెలిపారు. కాగా ఈ సమావేశం అనంతరం డేటా చార్జీలను విడుదల చేశారు. అతి తక్కువ ధరలో హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించనున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

జియో డేటా టారిఫ్ లు:
-1 ఎంబీ డేటా 5 పైసలు
-1జీబీ డేటా 50 రూపాయలు
-28 రోజులకు 300 ఎంబీ 4జీ డేటా టారిఫ్ రూ.149
-రూ.499కు 4 జీబీ 4 జీ డేటాతో పాటు నైట్ అన్‑లిమిటెడ్ డేటా యూసేజ్
-రూ.999లకు 10 జీబీ 4 జీ డేటా, 20 జీబీ వై-ఫై యూసేజ్, నైట్ అన్‑లిమిటెడ్ యూసేజ్
-రూ.1,499లకు 20 జీబీ 4 జీ డేటా
-రూ.2,499కు 35 జీబీ 4 జీ డేటా
-రూ.3,999కు 60 జబీ  4 జీ డేటా
-రూ.4,999కు 75 జీబీ 4జీ యూసేజ్, నైట్ ‑అన్‑లిమిటెడ్, 150 జీబీ వై-ఫై డేటా
-వైఫై హాట్ స్పాట్లతో రిలయన్స్ జియోపై 8 జీబీ డేటాను పొందవచ్చు.

Related posts:
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
ఆట ఆడలేమా..?
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
ఏపీకి ఆ అర్హత లేదా?
బిచ్చగాళ్లు కావలెను
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
అమ్మను పంపించేశారా?
మోదీ మీద మర్డర్ కేసు!
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments