జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్

Jobs will be recollated in India

భారతదేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కు భారీ షాక్ తగిలింది. ఆర్బిఎస్ (రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్) ఇన్ఫోసిస్ కంపెనీతో కుదుర్చుకున్న డీల్ ను క్యాన్సిల్ చేసుకోవడంతో దాదాపుగా ఆరు నెలల 4 కోట్ల డాలర్లు నష్టం కలుగుతుందని తెలిసింది. దాంతో ఇన్ఫోసిస్ లో మూడు వేల మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది అని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇన్ఫోసిస్ స్పందించింది. తాము కంపెనీలోని ఉద్యోగులను తొలగించడంలేదని క్లారిటీ ఇచ్చింది.

మీడియాలో వచ్చిన వార్తలపై ఇన్ఫోసిస్ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు అని.. స్పష్టం చేసింది. ఆయా ఉద్యోగాలను తగ్గించే యోచన లేదని, వారిని ఇతర ప్రాజెక్టులకు బదిలీ చేస్తామని ఇన్ఫోసిస్ వివరించారు. మొత్తంగా ఇన్ఫోసిస్ తమ సంస్థ నుండి మూడు వేల ఉద్యోగులను తొలగించేందుకు సిద్దంగా లేదని.. అది కేవలం పుకారు అని తెలిపింది. ఇన్ఫోసిస్ కంపెనీ నష్టాలను కంట్రోల్ చెయ్యడానికి ఇలా ఉద్యోగాల్లో కోత కోస్తుంది అన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు అని తెలిసింది.

 ఇన్ఫోసిస్ కు ఆర్బిఎస్ వల్ల కలిగే నష్టాన్ని పూరించడానికి ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం ఇప్పటికి తీసుకోకున్నా కూడా ఉద్యోగుల పర్ఫామెన్స్ ను బేస్ చేసుకొని కొంత మందిని అయినా వెనక్కి పంపించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా కొత్తగా ఇన్ఫోసిస్ కు ప్రాజెక్టుకు వచ్చినా కూడా మూడు వేల మందిని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. పాత ఉద్యోగులను రిప్లేస్ చెయ్యడం వల్ల ఆ అవకాశంకోల్పోవడంతో నిరుద్యోగులకు నిరాశ ఎదురవుతోందని చెప్పవచ్చు.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
పెట్రోల్ లీటర్‌కు 250
అతడి అంగమే ప్రాణం కాపాడింది
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
మోదీ ప్రాణానికి ముప్పు
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
తిరిగిరాని లోకాలకు జయ

Comments

comments