క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్

June 25 Is So Special in Indian Cricket

జూన్ 25.. క్రికెట్ ను ఇండియాలో ఒక మతం చేసిన రోజు. సగటు అభిమానిని గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రోజు. అదే టీమిండియా క్రికెట్ లో తొలి వరల్డ్ కప్ గెలిచిన రోజు. సరిగ్గా 33 ఏళ్ల క్రితం భారత క్రికెట్ చరిత్రను కొత్త మలుపు తిప్పిన కీలక ఘట్టం. నేడు క్రికెట్ ను ఓ మతం కన్నా ఎక్కువగా… క్రికెటర్లను దేవుడికంటే ఎక్కువగా అభిమానిస్తారు.. ఆరాధిస్తున్నారు అంటే అది కేవలం జూన్ 25న 1983లో చోటుచేసుకున్న ఓ ఘటన పుణ్యమే. దేశంలోనే కాదు ప్రపంచంలోని క్రికెట్ సామ్రాజ్యంలో మరుపురాని చరిత్రగా మిగిలిన జూన్ 25 గురించి..

కనీసం కలలో కూడా ఊహించలేదు.అసలు టీమిండియా అనే ఓ టీం ఉంటుంది. అందులోనూ స్టార్ ఆటగాళ్లు ఉంటారు అని ప్రపంచానికి చాటిచెప్పేలా 1983 జూన్ 25న క్రికెట్ మక్కా లార్డ్స్ లో జయకేతనం ఎగరేశారు కపిల్ అండ్ టీం. తెల్లోడి గడ్డపై ప్రపంచ కప్ చేతపట్టి మనమేంటో నిరూపించిన కపిల్ సేన భారతీయుల మనస్సులో చిరస్మరణీయమైన స్థానం సంపాదించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ సేన.. ప్రపంచ కప్ ఫైనల్లో అప్పటి మేటి జట్టు వెస్టిండీస్ ను మట్టికరిపించింది.

అప్పటి వన్డే ఫార్మాట్ ప్రకారం ఇన్సింగ్ కు 60 ఓవర్లు ఉండేవి.  టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన కపిల్ సేన 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. శ్రీశాంత్(38), మొహిందర్ అమర్ నాథ్(26) లు మాత్రమే చెప్పుకోతగ్గ స్కోర్ చేశారు. ఇక ఇండియా పనైపోయింది అనుకున్నారంతా. కరీబియన్ల దాటికి ఇండియన్లకు చుక్కలు ఖాయమేనన్న కామెంట్స్ వచ్చాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ .. భారత్ 140 పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అమర్ నాథ్(3/12), మదన్ లాల్(3/31) చెరో మూడు వికెట్లు తీసుకుని విండీస్ పతనాన్ని శాసించారు. కపిల్ దేవ్ పట్టుకున్న అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ ను మలుపుతిప్పింది. 28 బంతుల్లో 33 పరుగులతో జోరుమీదున్న రిచర్డ్స్ ను ఔట్ చేయడంలో కపిల్ చేసిన సాహసం ఎప్పటికీ మరవలేనిది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి మరీ క్యాచ్ ను పట్టుకున్నాడు. ఆ క్యాచే చేజారి ఉంటే కప్ కూడా చేజారి ఉండేది అంటుంటారు క్రికెట్ విశ్లేషకులు. ఏదిఏమైనా… 1983 వరల్డ్ కప్ భారత క్రికెట్ లో ఓ సువర్ణాధ్యాయం. ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి చేర్చింది. మ్యాచ్ ఉందంటే చాలు.. ఇండియన్లను వయస్సుతో భేదం లేకుండా టీవీలకు అతుక్కుపోయేట్టు చేసింది.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
బావర్చి హోటల్ సీజ్
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
సన్మానం చేయించుకున్న వెంకయ్య
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అంత దైర్యం ఎక్కడిది..?
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
చంద్రబాబు చిన్న చూపు
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
యుపీలో ఘోర రైలు ప్రమాదం
దివీస్ పై జగన్ కన్నెర్ర
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?

Comments

comments