తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ

Kabali-read-Telangana-Histo

Kabali read Telangana History.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

అవును.. తెలంగాణ చరిత్రను కబాలీ జైల్లో కూర్చొని చదివేశాడు. కబాలీ సినిమా రిలీజ్ తర్వాత వినిపిస్తున్న ఓ తెలంగాణ పుస్తకంపై అందరూ చర్చించుకుంటున్నారు. కబాలీ సినిమాలో జైల్లో ఉన్న రజినీకాంత్ చదివిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతున్నది. ఇది ఒక ఘనత అయితే.. అంతటి ఘనమైన పుస్తకాన్ని రాసింది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామవాసి కావడం మరో ఘనతగా నిలుస్తున్నది.

ఈ పుస్తకాన్ని వైబీ సత్యనారాయణ  రచించారు. దళిత కుటుంబంలో పుట్టిన సత్యనారాయణ తనతండ్రి గురించి సత్యనారాయణ రాసిందే ఈ పుస్తకం. బాలయ్య నిజాం కాలంలో రైల్వే ఉద్యోగిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌కు బదిలీపై వెళ్లారు. సత్యనారాయణ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే మొదలైంది. సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే పాఠశాలలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉన్నతవిద్యను పూర్తిచేసి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. రెండో కూతురు అమెరికాలో స్థిరపడటంతో చూసేందుకు వెళ్లారు. అక్కడ తన మనుమరాలిని చూసిన తర్వాత వంగపల్లిలో పుట్టి పెరిగిన తమ కుటుంబ ప్రస్థానం అమెరికాలో స్థిరపడ్డ వారికి తెలియాలంటే పుస్తకం రాయాలనే ఆలోచన కలిగిందని సత్యనారాయణ చెప్పారు.

నాలుగు తరాల కుటుంబ ప్రస్థానంతోపాటు నిజాం కాలంలో దళితులు ఎదుర్కొన్న సమస్యలను మై ఫాదర్ బాలయ్య అనే పేరుతో ఆంగ్ల భాషలో పుస్తకం రాశారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో మై ఫాదర్ బాలయ్య పుస్తకం పాఠ్యాంశంగా ఉండటం విశేషం. 2011లో ఇంగ్లీస్ లో వచ్చిన ఈ పుస్తకం 2013లో తెలుగులో, 2014లో కన్నడ, 2015లో హిందీ భాషల్లోకి పుస్తకం అనువాదం అయింది. మరో మూడు నెలల్లో తమిళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అనువాదం వెలువడనున్నట్టు సత్యనారాయణ తెలిపారు. మొత్తానికి తెలంగాణ చరిత్రకు సంబందించిన ఓ పుస్తకాన్ని రజినీ చదవడం.. అది వరల్డ్ వైడ్ గా పాపులర్ కావడం సెన్సేషన్.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
పెట్రోల్ లీటర్‌కు 250
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
పిహెచ్‌డి పై అబద్ధాలు
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
బాకీలను రద్దు చేసిన SBI
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
మోదీ మీద మర్డర్ కేసు!
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments