బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?

Karnataka cm contraversial statements on jobs

మహారాష్ట్రలో కేవ లం మరాఠీలకు మాత్రమే ఉద్యోగాలు అంటూ నాడు బాల్ థాకరే తీవ్ర కలవరాన్ని రేపారు. మొన్నటికి మొన్న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కూడా అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ నినదించారు. తెలంగాణ రాష్ట్రం కూడా అదే నినాదంతో ఏర్పడిందే. మా నీళ్లు…మా నిధులు… మా నియామకాలు అనేవే ప్రధానాంశాలు. అందుకే ఉద్యమనేత కేసీఆర్ సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అక్కడి ఉద్యోగుల్లో, ముఖ్యంగా బెంగళూరులోని ఉద్యోగుల్లో గుబులుపుట్టిస్తోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఉద్యోగాల కోసం…ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువకులు, యువత వలస వస్తారు. అక్కడి వాతావరణం కూడా సహకరించేదే. అనుకూల వెదర్ కావడంతో బెంగుళూరు అందరినీ ఆకర్షిస్తుంది. అలాంటి బెంగుళూరుకు ఇకపై ఉద్యోగాల కోసం ఎవరూ వెళ్లలేని పరిస్థితి వస్తుందా? అవుననే అంటున్నారు కన్నడ రాజకీయ విశ్లేషకులు. త్వరలో సిద్ధరామయ్య సర్కారు కన్నడిగులకే స్థానిక ఉద్యోగాలు అన్న నినాదంతో రానున్న ఎన్నికలకు వెళుతుందట. అదే వారి ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్ర్రంగా ఉంటుందట. రెండోసారి కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించాలంటే లోకల్ నినాదం నెత్తికెత్తుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించేసిందట. మరి దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Related posts:
కాటేసిందని పాముకు శిక్ష
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
సైన్యం చేతికి టర్కీ
ఆరిపోయే దీపంలా టిడిపి?
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ఓడినా విజేతనే.. భారత సింధూరం
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
చెరువుల్లో ఇక చేపలే చేపలు
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
అమెరికా ఏమంటోంది?
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
అమ్మ పరిస్థితి ఏంటి?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి

Comments

comments