రాసలీలల మంత్రి రాజీనామా

Karnataka minister resigned for x rated video

కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై మేతి రాజీనామా చేశారు. మంత్రి మేతి కర్ణాటక అసెంబ్లీలోని తన ఆఫీసులో రాసలీలలు సాగించారని ఇటీవ‌ల ఆరోపణలు వచ్చాయి. త‌న ఉద్యోగం బ‌దిలీ విష‌యంలో బాగల్‌కోట్‌కు చెందిన ఓ ఉద్యోగిని మంత్రిని క‌లిసిన‌ట్లు… ఈ క్ర‌మంలో మేతీ ఆమెతో ప‌లుమార్లు రాసలీలలు సాగించారని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే అసెంబ్లీ కార్యాల‌యంలో ఉద్యోగినితో రాస‌లీల‌లు సాగిస్తుండగా ఆ దృశ్యాలను ఆయన మాజీ గన్‌మన్ సుభాష్ రహస్యంగా వీడియో చిత్రీకరించాడు.. కాగా ఆ వీడియో ఇప్పుడు బయటకు వ‌చ్చింది. దీంతో త‌మ పార్టీకి న‌ష్టం క‌లగ‌కుండా సీఎం సిద్ధ‌రామయ్య మంత్రి మేతిని రాజీనామా చేయాల‌ని ఆదేశించారు.

కర్ణాటక టీవీ ఛానల్స్ లో బాగా పబ్లిసిటీ పొందిన మంత్రిగారి బూతు వీడియో కేవలం 30 సెకన్లు మాత్రమే వచ్చిందని,  నిజానికి  అరగంట పాటు ఈ వీడియో పుటేజ్ ఉంది అని తేలింది. మంత్రిగారితో పాటు వీడియోలో ఉన్న మహిళ ఎవరు అన్నదాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తోంది. కాగా మేతి రాజీనామాను వెంటనే ఆమోదించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్ ద్వారా గవర్నర్ వాజుభాయ్ వాలాను ఆయన కోరారు. మొత్తానికి కర్ణాటకలో తీవ్ర దుమారాన్నిరేపిన మంత్రిగారి వ్యవహారం రాజీనామాతో ఓ కీలక మలుపు తిరిగింది.

Related posts:
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
‘స్టే’ కావాలి..?
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఈ SAM ఏంటి గురూ..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
ప్యాకేజీ కాదు క్యాబేజీ
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
అందుకే భూకంపం రాలేదట
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి

Comments

comments