చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్… అతడికి మాత్రమే సాధ్యమైంది

Kashmir Governor Jagmohan brought peace in Kashmir

చిన్నప్పటి నుండి కాశ్మీర్ అంటే అందాలకు ఎంత ప్రసిద్దో కాశ్మీర్ గొడవలకు కూడా అంతే ప్రసిద్ది. అందుకే ఎక్కడైనా ఎక్కువగా గొడవలు జరుగుతుంటే దాన్ని కాశ్మీర్ తో పోలుస్తుంటారు. మరి అలాంటి కాశ్మీర్ లో ఇప్పుడు మనం చూస్తున్న రక్తపాతం.. భయంకర దృశ్యాలు కాకుండా ప్రశాంతంగా ఎప్పుడు ఉండేది..? కాశ్మీర్ ఎప్పుడు ప్రశాంతంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందో తెలుసా..? 1984 ఏప్రిల్ 26 నుండి 1989 జులై వరకు కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉండేది. అవును దానికి కారణం కూడా ఓ వ్యక్తి… అతడే జగ్మోహన్.

1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఇండియా, పాకిస్థాన్ లు దేశాల సరిహద్దుల వద్ద ఎలాంటి కాల్పులకు దిగరాదు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా తర్వాత మాత్రం శరామామూలే. అయితే ఆ తర్వాత దాదాపుగా ఐదు సంవత్సరాలు కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది. చరిత్రలో అన్నాళ్లపాటు కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అంటే అది కేవలం జగ్మోహన్ అనే గవర్నర్ కారణంగానే. జగ్మోహన్ ను గవర్నర్ గా నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన తర్వాత కాశ్మీర్ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి.

కాశ్మీర్ లో ముందుగా అభివృద్దిలేనందుకే అన్ని సమస్యలు అని గుర్తించిన జగ్మోహన్ దానిని నివారించేందుకు నడుం బిగించారు. కాశ్మీర్ లో నాడు చాలా ప్రాంతాలకు రోడ్డు మార్గం కూడా ఉండేది కాదు. కానీ దానికి మార్గాలు వేసి కాశ్మీరీలకు అభివృద్ది రుచి చూపించారు. దాంతో కాశ్మీర్ లో చాలా కాలం పాటు తిరుగుబాటు, ఉద్యమాలు, రక్తపాతాలు లేకుండా ఉన్నాయి. దిల్లీ, గోవాలకు లెఫ్టనెంట్ గవర్నర్ గా పని చేసిన జగ్మోహన్ కాశ్మీర్ ను ప్రపంచానికి, ప్రపంచాన్ని కాశ్మీర్ కొత్త కోణంలో చూసేలా చేశారు.

ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలోని చాలా ప్రాంతాలకు ఆయన స్వయంగా వెళ్లి అభివృద్ది గురించి చర్చించడం చరిత్ర ఎన్నటీకీ మరిచిపోదు. అప్పట్లో పత్రికల్లో కాశ్మీర్ కొత్త కోణాన్ని చూస్తోంది.. దానికి కారణం గవర్నర్ జగ్మోహన్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. అప్పటి నుండి ఇప్పటికి కూడా జగ్మోహన్ లాంటి గవర్నర్ రారు.. రాలేడు అని సీనియర్ జర్నలిస్ట్ లు కూడా అనుకుంటారు అంటే ఆయన ఎంత ప్రభావశీలంగా పని చేశారో అర్థం చేసుకోవచ్చు.

జగ్మోహన్ నుండి ఇప్పటికి తరతరాలుగా చెప్పుకుంటున్నారు అంటే ఆయన మార్క్ ఏ విధంగా వేశారో తెలుసుకోవచ్చు. అందరం చిన్నప్పటి నుండి కాశ్మీర్ అంటే కల్లోలానికి పర్యాయపదం అని చదువుకున్నాం.. కానీ ప్రతి చరిత్రలో ఓ చీకటి కోణం ఉన్నట్లే.. వెలుతురు కూడా ఉంటుంది. అలా కాశ్మీర్ కు వెలుతురును ప్రసాదించింది మాత్రం జగ్మోహన్. తర్వాత కొన్ని కారణాల కారణంగా ఆయనను తప్పించాల్సి వచ్చింది. రెండోసారి ఆయన గవర్నర్ గిరి చేసినా కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. మొత్తంగా కాశ్మీర్ అందాలతో మునిగిపోయి.. నెత్తుటి దాహానికి దూరంగా ప్రశాంతంగా బ్రతికింది మాత్రం 1984-89ల మధ్య జగ్మోహన్ గవర్నర్ గా పని చేసినప్పుడు మాత్రమే.

కాశ్మీరీలు, ఇండియన్స్, పాకిస్థానీలు, యావత్ ప్రపంచం ఒక్క మగాడుగా కీర్తించబడిన అటల్ బిహార్ వాజ్ పేయి కాశ్మీర్ కు ఏం చేశాడు.? అంత కీర్తి ప్రతిష్టలు ఎందుకు వచ్చాయి అనే విషయాలను ఎనిమిదో భాగంలో తెలుసుకుందాం.
–  Abhinavachary

Also Read:

కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది(మొదటి భాగం)

పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..(రెండో భాగం)

కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు(మూడో భాగం)

కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ(నాలుగో భాగం)

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు(ఐదో భాగం)

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
ఆ అద్భుతానికి పాతికేళ్లు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
సింధూరంలో రాజకీయం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ఉక్కిరిబిక్కిరి
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
బాబు Khan
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత

Comments

comments