దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్

KCR bacame number one CM in India

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు దేశంలో ముఖ్యమంత్రులందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేరయా అని చెప్పుకోవాలేమో. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి పనితీరు ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీ ర్యాంకులు ఇచ్చారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో సిఎం కేసీఆర్ చేస్తున్న పరిపాలనకు వందకు వంద శాతం మార్కులుపడ్డాయి. దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలో సిఎం కేసీఆర్ మొదటి ర్యాంకు సాధించడం.. కేసీఆర్ పనితీరుకు అద్దంపడుతోంది. ముఖ్యమంత్రుల పనితీరు, కొత్త సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వం వివరాలు సేకరించినట్లు తెలిసింది.

ఈ నెల 16న దిల్లీలో జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో ముఖ్యమంత్రుల ర్యాంకులను ప్రధాని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజల సంతృప్తి స్థాయిల ఆధారంగా ప్రధాని మోడీ ముఖ్య మంత్రులకు ర్యాంక్‌లు కేటాయించాలని భావించి అందుకనుగుణంగా ప్రతి మూడు నెలలకోసారి సర్వే జరిపిస్తున్నారు. అందులో భాగంగా తీసుకున్న వివరాలు కేసీఆర్ కు వందకు వంద శాతం మార్కులు పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకువస్తున్న పథకాలతో ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తేలింది. అన్నింటికి మించి అవినీతి మరక లేకుండా కేసీఆర్ సాగిస్తున్నపరిపాలన అందరి మన్ననలు పొందుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా మిషన్‌ కాకతీయ తో ప్రస్తుతం దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో చెరువులు నిండు కుండలా నీటితో కళ కళాడుతున్నాయి , వచ్చే ఎన్నికల్లో ఇంటిఇంటికి వాటర్ ఇవ్వకపోతే నీళ్ళను ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగను అని చెప్పి ..దాన్ని నెరవేర్చే క్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ తో  ఇదే నెల మెదక్ లో తొలిసారిగా ఇంటి ఇంటికి నీటి సరఫరా చేయనుండటమే కాకుండా ..ఆ కార్యక్రమం రాష్ట్రం అంత 80శాతం పూర్తీ కావడం

ఆడబిడ్డ పెళ్లిలు చేయలేక నానా తంటాలు పడే ముస్లీం ల కోసం  షాదీ ముబారక్‌, అన్ని వర్గాల వారి కోసం కళ్యాణ లక్ష్మి,నడవలేని చివరి దశలో ఉన్న వృద్దులకు  ఆసరా, భర్త చనిపోయిన వారికి వితంతు పింఛను ,దళిత విద్యార్ధులు విదేశాలలో చదువుకోవడానికి ప్రభుత్వం తరపున 25లక్షల వరకు ఆర్ధిక సహాయం ,నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఇప్పటివరకు 30 వేల పైగా ఉద్యోగాలకు నోటిపికేషన్ లు ,పేదవారి ఆకలి తీర్చడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇలా ఎన్నో  వినూత్న పథకాలతో పాటు గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్‌ తీసుకొస్తున్న ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ .. వాటికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయా రాష్ట్రాలు ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి అన్వయించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రీన్ తెలంగాణ కోసమే కాకుండా రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడటమే కాకుండా రాష్ట్రం అంత వర్షాలు విరివిరిగా కురవాలని ,ప్రస్తుతం కాలుష్యం అయిన పర్యావరణాన్ని కాపాడటం కోసం  పర్యావరణ పరిరక్షణ పేరిట కేసీఆర్‌ చేపట్టిన హరితహారానికి ప్రజల నుచే కాకుండా పక్కరాష్ట్రాల నుండి కూడా విశేష స్పందన లభిస్తోంది.అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ప్రవేశపెట్టడం గమనార్హం .ఇలా ఇవన్నీ కేంద్ర నిఘావర్గాల సర్వేలో కేసీఆర్‌కు మంచి మార్కులు పడేలా ఉపకరించాయని చెబుతున్నారు. మరోవైపు ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 13వ స్థానం దక్కింది . తనకు 13వ స్థానం కేటాయించినట్టు సమాచారం అందగానే ఏపీ సీఎం అధికారుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ విద్యుత్ సమస్య, నీటి పంపకాల విషయంలో కాస్త ఇబ్బందిపడ్డా కేసీఆర్ సర్కార్ వాటిని ఎదుర్కొన్న తీరు తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుంది. కేంద్రం నుండి ఎలాంటి సహాయం రాకున్నా కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ అందరి సంక్షేమాన్ని ఆకాంక్షస్తూ పథకాలను ప్రవేశపెడుతున్నారు. బంగారు తెలంగాణ కలలను సాధించేందుకు అన్ని మార్గాలను సుగమం చేస్తున్నాడు కేసీఆర్. ఇక ర్యాంకింగ్స్‌లో కేసీఆర్‌ తరువాత వరుసగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, గుజరాత్‌ సీఎం ఆనందీ బెన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు ఉన్నారు .

Related posts:
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
సింగ్ ఈజ్ కింగ్
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
వీళ్లకు ఏమైంది..?
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
జగన్ అన్న.. సొంత అన్న
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
సన్మానం చేయించుకున్న వెంకయ్య
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
రాజీనామాలు అప్పుడే
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
2018లో తెలుగుదేశం ఖాళీ!
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
దిగజారుతున్న చంద్రబాబు పాలన
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
మావో నాయకుడు ఆర్కే క్షేమం
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?

Comments

comments