ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్

KCR became top most Chief Minister

దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మొదటి స్థానంలో నిలిచారు. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో అత్యధికంగా 87 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలనకు అత్యుత్తమ ర్యాంకింగ్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా కనీసం 51 శాతం ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనీ, అదేవిధంగా 17 లోక్ సభ స్థానాలను తెరాస గెలవగలదనీ సర్వేలో వెల్లడైంది. కేసీఆర్ తర్వాత స్థానంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (85%), మమతాబెనర్జీ (79%), జయలలిత (75%) నిలిచారు.

సుమారు 12 వేల మందిని తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఈ సర్వే కోసం ప్రశ్నించారు. రెండున్నరేళ్ళ పాలనలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారనీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలే కాకుండా పాలన సాగుతున్న తీరుపై కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ఎన్నికల్లో ఎలా అయితే టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించిందో.. అదే ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని సర్వేల్లో కూడా తేలింది.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
సైన్యం చేతికి టర్కీ
బాబోయ్ బాబు వదల్లేదట
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అంత దైర్యం ఎక్కడిది..?
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
2018లో తెలుగుదేశం ఖాళీ!
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments