అడకత్తెరలో కేసీఆర్

KCR facing Telangana brand Issue with Sania Mirza and PV Sindhu

దేశం మొత్తం పివి సింధు గెలుపుపై చర్చ సాగుతుంటే… తెలంగాణవ్యాప్తంగా మాత్రం సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందా..? అని చర్చ సాగుతోంది. కొంత మంది తెలంగాణ వాళ్లు ఏకంగా సానియా మీర్జాకే టెండర్ వేశారు. అదేంటి సింధు విజయం సాధిస్తే సానియాకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఉంది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియామీర్జా కొనసాగుతోంది. గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సానియామీర్జాను కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా టిసర్కార్ ప్రకటించింది.

తెలంగాణ సర్కార్ ఇలా ఊరికే ప్రకటిస్తే ఏముంటుంది… అందుకే కేసీఆర్ సానియామీర్జాకు కోటి రూపాయల నగదును బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా కు ప్రకటించేశారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. తెలంగాణ సర్కార్ సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించే టైంలో పెద్దగా టోర్నీలు గెలవలేదు.కానీ అదే టైంలో సైనా నెహ్వాల్ ప్రపంచవ్యాప్తంగా తన విజయవీచికలు విహరించజేసింది. కానీ కేసీఆర్ మాత్రం సైనాను కాదని, సానియాకే బ్రాండ్ అంబాసిడర్ గా పట్టంకట్టారు.

కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది పొలిటికల్ యాంగిల్ లో విశ్లేషించారు. కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గానికి చెంది ఓటు బ్యాంకును మూటగట్టుకునేందుకు ఇలా చేశారని వాదన వినిపిస్తోంది. కానీ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా చేసిందేమీ లేదు. మొన్నామధ్యన తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడితే సానియా మాత్రం ఏదో తప్పదు అన్న చందంగా ఓ చెట్టు కింద మొక్కను నాటింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇక సింధు విషయానికి వస్తే.. పివి సింధు హైదరాబాదీ బిడ్డ. అందులోనే తెలంగాణ సంస్రృతికి అద్దంపట్టే బోణాల పండగ నాడు బోణమెత్తి తెలంగాణ బిడ్డగా గుర్తింపుతెచ్చుకుంది. 18 ఏళ్లకే అర్జున అవార్డును సొంతం చేసుకుంది. పాల్గొన్న మొదటి ఒలంపిక్స్ లోనే భారత్ కు సిల్వర్ మెడల్ ను తీసుకువచ్చింది. మరి ఇన్ని అర్హతలు ఉన్న సింధును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని డిమాండ్ వినిపిస్తోంది. కానీ కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని వార్త.

గతంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జాను తీసి.. పివి సింధును నియమించడం అంటే అంత సులభం కాదు. పైగా సింధు గెలిచింది కాబట్టి సానియా మీర్జా గెలవలేదు కాబట్టి ఇలా నిర్ణయం తీసుకున్నాం అనే వివరణ సరిపోదు. అన్నింటికి మించి కేసీఆర్ సర్కార్ కు ఓ వర్గం ఓట్లు సానియాను తప్పిస్తే దూరమవుతాయి అనే భయం ఉందని అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు మాత్రం దేశం మీద కూడా ప్రేమలేని సానియా కన్నా… దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన పివి సింధుకే తెలంగాణ ‘బ్రాండ్ అంబాసిడర్’ కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
ఆ అద్భుతానికి పాతికేళ్లు
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పవన్ ను కదిలించిన వినోద్
అన్నదమ్ముల సవాల్
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
జగన్ క్రిస్టియన్ కాదా!
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments