జెండా తెచ్చిన తిప్పలు

KCR facing troubles with Nations Largest Flag

మూడు రంగుల జెండా.. ముచ్చటగొలిపే జెండా.. ఎగిరింది కనుల నిండా అని హైదరాబాదీలు అనుకుంటున్నారో లేదో అప్పుడే నాలుగు సార్లు జెండాను మార్చాల్సి వచ్చింది. దేశంలోనే అతి పెద్ద జెండాగా రికార్డుల్లోకి ఎక్కిన మన సంజీవయ్య పార్కు దగ్గరలోని 303 అడుగుల భారీ జెండా తెలంగాణ సర్కార్ కు కొత్త తిప్పలు పెడుతోంది. జాతీయ జెండా.. అంటేనే ఓ అంకిత భావం. జాతి గౌరవానికి జాతీయ జెండా ఓ ప్రతీక. అలాంటి జాతీయ జెండాను హుస్సేన్ సాగర్ కు దగ్గరలో.. హైదరాబాద్ నడిబొడ్డులో ఎగరవేయడం ద్వారా ప్రత్యేకతను చాటుకున్నారు కేసీఆర్.కానీ ఈ జెండా భారీగా ఉండటం వల్ల కలుగుతున్న ఇబ్బందులు ఇప్పుడు అధికారులతో పాటుగా కేసీఆర్ పై కూడా విమర్శలకు తావిస్తోంది.

జెండా స్తంభం ఎత్తు 303 అడుగులు.. ఇది దేశంలోనే పెద్దది. పతాకం 72 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవు ఉంటుంది. 92 కిలోల బరువుంది. తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా హైదరాబాదీలు ఎంతో గర్వించేలా కేసీఆర్ దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన మంచిదే.. కానీ దాని వల్ల కలుగుతున్న ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించగలగాలి. వారంలోనే నాలుగు సార్లు జెండా చిరిగిపోవడం వార్తల్లో నిలిచింది. చిరిగిన జెండాను ఎగరవేయకూడదు కాబట్టి వెంటనే దాన్ని కిందకు దించి… వేరే జెండాను ఎగరేశారు. కానీ గాలులు బలంగా ఉండటం వల్ల ఎగరేసిన ఒక జెండా.. అదనంగా ఉంచుకున్న రెండు జెండాలు కూడా చిరిగిపోయాయి. దాంతో జెండా స్థంభాన్ని ఖాళీగా ఉంచి.. జెండాలను కుట్టేందుకు దర్జీకి ఇచ్చారు.

ఈ జెండాల నిర్వహణ బాధ్యతను హెఎండిఎకు అప్పగించారు. జాతీయ జెండాను ఎగరవేసుందుకు ఏర్పాటు చేసిన జెండా స్థంభానికే కోటి 50లక్షలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఇక సంవత్సరానికి 50లక్షల రూపాయలు జెండా నిర్వహణ కోసం కేటాయిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ అందాలను రెట్టింపు చెయ్యాలన్న కేసీఆర్ ఆలోచన ఖచ్చితంగా స్వాగతించాల్సిందే.. కానీ జెండా ఏర్పాటు తర్వాత తలెత్తే సమస్యల గురించి ముందే సమీక్షించి ఉంటే బాగుండేది. అదీ కాక.. నిర్వహణకు భారీగా ఖర్చవుతున్న నేపథ్యంలో కూడా సన్నాయి నొక్కుల్లు వినిపిస్తున్నాయి. అలాగే హుస్సేన్ సాగర్ లో తిరిగే బోట్ లకు, సెయిలింగ్ చేసే వాళ్లకు ఇంత పెద్ద జెండా పరోక్షంగా ఇబ్బంది అనే వాదన కూడా వినిపిస్తోంది.

సంజీవయ్య పార్కు దగ్గర ఏర్పాటు చేసిన ఈ జాతీయ జెండా ఎక్కడనుండి చూసినా.. దూరంగా వేరే చోట ఉంది అనే ఫీల్ కలుగుతోంది. నెక్లెస్ రోడ్ నుండి, ట్యాంక్ బండ్ మీదకు వెళ్లే మోటరిస్ట్ లకు ఈ జెండా కనుల విందు చేయిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ కు వచ్చే వాళ్లకు దగ్గరి నుండి చూస్తున్న అనుభూతి వాళ్లకు తన్మయత్వాన్ని కలిగిస్తోంది. మొత్తానికి పర్యాటకులకు, రోడ్డు వెంట వెళ్లే చోదకులకు, సేదతీరేందుకు వచ్చే సేదకులకు జెండా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

రాంచీ, రాయపూర్, దిల్లీ, ముంబైలలో దాదాపు 250 అడుగుల కంటే ఎత్తైన జెండాలు ఉన్నప్పటికీ వాటితో పెద్దగా సమస్య రాలేదు. కానీ హైదరాబాద్‌లో ఉన్న ఈ జెండా ఏర్పాటు చేసి కనీసం రెండు వారాలు కూడా గడవనే లేదు.. అప్పుడే ఆటంకాలు మొదలయ్యాయి. మరి దీని మీద కేసీఆర్ ప్రభుత్వం ఎలా శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందో చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం. హైదరాబాద్ అంటే ఓ చార్మినార్, ఓ బుద్దుడు, ఓ హైటెక్ సిటి ఎలాగో.. భవిష్యత్ లో ఈ జాతీయ జెండా కూడా ఐకాన్ గా ఖచ్చితంగా మారుతుంది.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
అతడికి గూగుల్ అంటే కోపం
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
యుపీలో ఘోర రైలు ప్రమాదం
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
మోదీ ఒక్కడే తెలివైనోడా?

Comments

comments