లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు

KCR Govt cancel Eamcet2 exam

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై కోట్ల డీల్.. వేల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన వ్యవహారం. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఘరానా మోసం వెలుగులోకి రావడంతో ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ 2 పరీక్షపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. దాంతో సిఐడీ చేత విచారిస్తున్న ప్రభుత్వం మొత్తం పరీక్షనే రద్దుచేస్తున్నట్లు ప్రకటించడానికి సిద్ధమవుతోంది. కాగా దీనిపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తుండటంతో ప్రభుత్వం డైలమాలో పడింది.

ఎంసెట్-2 రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ చర్చలు, న్యాయనిపుణల సలహా మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంసెట్-2 రద్దుకే మొగ్గు చూపారు. గతంలో లీకైన సమయాల్లో అవలంభించిన విధానాలు, ఆ సందర్భంగా పరిశీలించిన అంశాలు, ఆ సందర్భంగా న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-3 నిర్వహణకు మొగ్గుచూపింది. ఈ సందర్భంగా ఎంసెట్-2 రాయడం ద్వారా ఇబ్బంది పడ్డ విద్యార్థులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

దీంతో తెలంగాణ ఎంసెట్-2 రద్దైందని నిర్ధారణ అయింది. లీకేజీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులను క్షోభపెట్టినవారిని ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై హైకోర్టును కొంత మంది ఆశ్రయించిన నేపధ్యంలో భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ముందుచూపుతో ఎంసెట్-2ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. 40 రోజుల్లో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు కోచింగ్ కూడా ప్రభుత్వం ఇచ్చేదిశగా చర్చలు నడుస్తున్నాయి.

Related posts:
ఇదో విడ్డూరం
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
దివీస్ పై జగన్ కన్నెర్ర
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఛాయ్‌వాలా@400కోట్లు
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

Comments

comments