అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?

KCR govt gave permission on that time but now order to demolish

హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో అతలాకుతమైంది. హైదరాబాదీలు తీవ్ర బాధలు ఎదుర్కొన్నారు. చాలా వరకు ఏరియాలు చెరువులను తలపించాయి. అయితే దీనిపై కేసీఆర్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. అసలు ఈ సమస్య తలెత్తడానికి కారణం ఏంటా..? అని ఆరా తీసిన సర్కార్ కు చెరువుల దురాక్రమణ అంశం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిఎం కేసీఆర్ నాళాలపై అక్రమంగా నిర్మించిన, చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన అన్ని కట్టడాలను వెంటనే కూల్చివెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు ఎంతటి వాళ్లవైనా.. ఎంపీవైనా..మంత్రివైనా కూడా కూల్చాల్సిందే అని తేల్చిచెప్పారు.

దాంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే కూల్చివేతలకు తెర తీశారు. నగరంలోని చాలా చోట్ల అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి. అసలు సమస్య ఎక్కడ వచ్చింది అనేదే. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది అన్న వాఖ్యాలు దీనికి సరిపోవు. మరి దీనికి కారణం ఇప్పటి పాలకులది కాదు అని అనడానికి కూడా వీలులేదు. భాగ్యనగరాన్ని విశ్వనగరాన్ని చేస్తామని ఊదరగొట్టిన కేసీఆర్ సర్కార్ కూడా నిర్వాకంలో చేతులు కలిపింది. అందునా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం కొంత ఎక్కువే పాపాన్ని మూటగట్టుకుంది.

జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను క్రమబద్దీకరించుకునే వెసలు బాటు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా..? నీటి కనెక్షన్లు అక్రమంగా తీసుకున్నా పర్లేదు.. కానీ రెగ్యులరైజ్ చేయించుకుంటే సరిపోతుంది అని స్వాగతించింది ఎవరు..? మరి అప్పుడు మీరు ఏం కట్టుకున్నా.. ఎలా కట్టుకున్నా కానీ స్వాగతిస్తామని తలుపులు బార్లాతెరిచిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు మాత్రం తమ తప్పు ఏమీలేదు అన్నట్లు నీతులు చెబుతున్నారు. నాళాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేసేందుకు ఆర్డర్లిచ్చారు. మరి అప్పుడు ఎన్నికల టైంలో కేసీఆర్ కు ఆ అక్రమ కట్టడాల కన్నా ఓటు బ్యాంకు కనిపించింది అన్న మాట వాస్తవమో కాదో అందరికి తెలుసు.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments