కేసీఆర్ పై జీవో 123 పిడుగు

KCR govt may shocks with High court Judgement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ముందు నుండి మల్లన్న సాగర్ పై కేసీఆర్ సర్కార్ కు చుక్కలు కనిపిస్తుంటే. తాజాగా అదే ప్రాజెక్టు కోసం నిర్వహించిన భూసేకరణపై కూడా అడ్డుపుల్లతగిలింది. ఈసారి రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 123పై హైకోర్టు మొట్టికాయలు వేసింది. తెలంగాణ సర్కార్ జీవో 123 కింద భూసేకరణ చెయ్యడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. భూసేకరణ చట్టం 2013 చట్టం అమల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా జీవో 123 ని తీసుకువస్తుందని ప్రశ్నించింది. పార్లమెంట్ లో చేసిన చట్టానికి విలువనివ్వరా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులు వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ మేరకు తన తీర్పును వెల్లడించింది. తెలంగాణ సర్కార్ భూసేకరణ చట్టం 2013 ప్రకారం కాకుండా జీవో 123 ప్రకారం భూసేకరణ చేపడుతోందని, దాని వల్ల తాము నష్టపోతున్నామని కోర్టులో కేస్ ఫైలైంది. దానిపై విచారించిన కోర్టు తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. జీవో నెంబర్ 123ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ముందే అన్నిఅడ్డంకులు తొలిగాయని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికి ఇది నిజంగా ఎదురుదెబ్బే.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
అమిత్ షా రేస్ లో... తుస్
చంద్రబాబు నెంబర్ వన్..
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
పవర్ లేని పవర్ ?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments