మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్

KCR govt over buildup in telangana state

తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడిపోయేలా చేసి… స్వయం పాలనకు శ్రీకారం చుట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో విజయవంతంగా నడిపిన కేసీఆర్ తిరుగులేని అధికారంతో తెలంగాణ పాలనాపగ్గాలను చేట్టారు. ఉద్యమ సమయంలో ఎక్కువగా మాట్లాడిన కేసీఆర్.. అధికారాన్ని చేపట్టిన తర్వాత మాత్రం తన మాటలను ఆచరణలో పెట్టారు. అందుకే ఇప్పటికే దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా సిఎం కేసీఆర్ మొదటి స్థానాన్ని పొందారు. కేసీఆర్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి.. ప్రతిపక్షాలు లేకుండా చేశారు. తెలంగాణలో ఏకచక్రాధిపత్యాన్ని సాగిస్తున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే మరోవైపు ఇంకో కోణం ఉంది.

తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు ఇప్పటికే బిచాణా ఎత్తుకున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలు కూడా వెకెన్సీ బోర్డులు పెట్టుకున్నాయి. అయితే కేసీఆర్ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. టైం ఎప్పటికీ ఒకేలా ఉండదు. తెలంగాణలో మీడియాను నయానో, భయానో కేసీఆర్ తన వైపు తిప్పుకున్నాడు. మీడియాలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కూడా ఎలాంటి వార్తలు రావడం లేదు. కానీ ఇవే పరిస్థితులు ఎప్పటికి ఉండవు. తెలంగాణ ప్రభుత్వం మేడిపండు చందంగా అంతా మాయ చేస్తోంది అని నిరూపించడానికి.. కింద కారణాలున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటూ ఎవరూ ఉండరు అని కేసీఆర్ ఎన్నోసార్లు అన్నారు. ఉద్యమం టైంలో ఎంతో మందిని ఉద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది కూడా ఇది. కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారా..? అని ఎదురుచూస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. పైగా ఎన్నికలు సమీపించే వరకు కూడా ప్రకటన వస్తుంది అని చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఏమాత్రం తేడా చేసినా కేసీఆర్ ప్రభుత్వానికి గండం తప్పదు.

ఇక ముందు నుండి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదాయంలో టాప్ అంటూ బూరలు పెట్టి బాజా బజాయించినా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అలా లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆదాయం బాగా తగ్గిందని, ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పనులు చేపట్టినా కేసీఆర్ భారీగా నిధులను విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఎన్నోసార్లు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే తెలంగాణ సర్కార్ ఆరోగ్య శ్రీ కింద చెల్లించాల్సిన చెల్లింపులను ఇంకా చెల్లించలేదు. అలాగే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అయినా కూడా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత ప్రస్తుతానికి లేదు. కానీ ప్రభుత్వం మీద ఈ వర్గాలకు మాత్రం ఆగ్రహం ఉంది. అది అలాగే కొనసాగితే మాత్రం సర్కార్ కు చుక్కలే.

అలాగే ఉద్యమం టైంలో ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కేసీఆర్ కూడా విశ్వప్రయత్నాలు చేశారు. కేసీఆర్ ముస్లింలకు అనుకూలంగా ఎన్నో అనుకూల నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ ముస్లింలకు కల్పిస్తామన్న రిజర్వేషన్ల మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అడుగుపడలేదు. ముస్లిం రిజర్వేషన్ కల్పనకు ఓ కమిటీని నియమించడం.. ఆ కమిటి నివేదికను తయారుచేసే పనిలో ఉండటం జరిగింది. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. రెండున్నరేళ్లు గడుస్తున్నా కానీ ఇంకా హామీ దశలోనే ఉన్న ముస్లిం రిజర్వేషన్ అంశం కేసీఆర్ కు గుదిబండే.

ఇక అన్నింటికి మించి కేసీఆర్ ను పేదలకు చేరువ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలోనూ వ్యతిరేకత ఉంది. ఎంతో మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కల్పిస్తామని హామి ఇచ్చిన కేసీఆర్… ఆ దిశగా అడుగులు వెయ్యడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి డబ్బులు లేవంటూనే సచివాలయాన్ని నిర్మించడానికి మాత్రం కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది కూడా కేసీఆర్ కు శరాఘాతంగా మారుతుంది. ఉద్యమం టైంలో ఉద్యోగులను ఇంటివాళ్లలాగా చూసుకుంటామని, ప్రతి ఉద్యోగి కూడా నవ్వుతూ, ఆనందంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. కానీ హోంగార్డుల మీద మాత్రం కర్కశంగా లాఠీఛార్జి చేయించారు. ఇలా కేసీఆర్ సర్కార్ పరిస్థితి మేడిపండు చందంగా మారింది.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ ను కదిలించిన వినోద్
ఆ అరుపులేంటి..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
తొక్కితే తాటతీస్తారు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments