కేసీఆర్ మార్క్ ఏంటో?

KCR govt stratigic step on opposition parties

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన రెండో రోజే తీవ్ర సంచలనం రేగింది. ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఏకంగా పదకొండు మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. విలువైన సభాసమయాన్ని కాంగ్రెస్‌ వృథా చేస్తోందని శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు . ప్రజల సమస్యలపై చర్చిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ అడ్డుకోవడం సరికాదన్నారు. ఉనికిని చాటుకునేందుకే కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు.

9మంది కాంగ్రెస్‌ సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు డి.కె.అరుణ, మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్‌, గీతారెడ్డి, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, జీవన్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని  టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టడితే..ఇలా చేయడం సరికాదని చెప్పారు. సస్పెన్షన్‌ పై ఆలోచించాల్సిన స్పీకర్..అధికారపార్టీకే అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు.

అయితే ఈ మొత్తం పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం కేసీఆర్ మరోసారి తన మార్క్ చూపుతున్నారని అంటున్నారు. కేసీఆర్ సర్కార్ ఇప్పటికే ప్రతిపక్షాలను దాదాపుగా అవసాన దశకు చేర్చిన తర్వాత అసెంబ్లీలో తిరుగులేకుండా చేసుకున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షాలు గట్టిగా గొంతు వినిపిస్తున్న తరుణంలో ఇలా సస్పెన్షన్ వేటు వెయ్యడం వల్ల వారి గొంతు నొక్కేయొచ్చు అని కేసీఆర్ ప్లాన్ అయి ఉండవచ్చు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం రాజకీయ సర్కిల్స్ లో బాగా పాపులర్ అవుతోంది.

Related posts:
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
‘స్టే’ కావాలి..?
తెలంగాణకు ప్రత్యేక అండ
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
బాబును వదిలేదిలేదు
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
నరేంద్రమోదీ@50 రోజులు
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments