దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!

KCR May expand cabinet on Diwali

తెలంగాణలో ధమాకా సీజన్ నడుస్తోంది. ప్రతి పండగకు ఓ ధమాకాను ప్రకటిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. రంజాన్ రోజు మైనార్టీలకు మేలు చేస్తూ ఓ ప్రకటన చేస్తారు.. దసరా నాడు కొత్త జిల్లాలను ప్రారంభించారు. మరి దీపావళికి ఏం చేస్తారు ..? అన్న దానిపై తెలంగాణలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అయితే ఈ పండగకు మాత్రం ఖచ్చితంగా కొత్త మంత్రులకు కేబినెట్ లో చోటిస్తారని ప్రచారం నడుస్తోంది. అవును.. దీపావళికి కేబినెట్ ను విస్తరించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు సంవత్సరంన్నరగా విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీపావళికి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తాజాగా పూర్తి అవ్వడంతో ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణకు కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరు లేదా ముగ్గురికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కొత్తగా ఇద్దరు మహిళలతో పాటు మొత్తం అయిదుగురును తీసుకుంటారని అంటున్నారు.

మంత్రి పదవి నుండి తప్పించిన వారిని పార్టీ కోసం వినియోగించుకుంటాం అని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న అందరు మంత్రుల పనితీరు బాగున్నప్పటికి కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నట్లుగా టీఆర్‌ఎస్‌ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలకు త్వరలోనే మంత్రి పదవులు దక్కబోతున్నాయి. అయితే ఆ అదృష్టవంతులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మహిళ ఎమ్మెల్యేలు              నియోజక వర్గం
కోవాలక్ష్మి                             ఆసిఫాబాద్
అజ్మీరా రాధికా నాయక్          ఖానాపూర్
బోడిగ శోభ                          చొప్పదండి
పద్మాదేవేందర్ గౌడ్                మెదక్
గొంగిడి సునీత                      ఆలేరు
కొండా సురేఖ                       వరంగల్ తూర్పు

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
తెలుగుదేశంలో ఆగష్టు భయం
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments