కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం

KCR-Cinema

మాటల మరాఠిగా పేరున్న కేసీఆర్ మరోసారి తన మాటల తూటాలను మోదీపై పూలుగా మలిచారు. మొన్నటిదాకా కేంద్రం నుండి సరైన సహకారం లేదు అన్న కేసీఆర్ ఉన్నట్టుండి మోదీ పాట పాడారు. మోదీని మునగచెట్టు ఎక్కించి… చిటారు కొమ్మ మీద నిల్చోబెట్టారు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికి కేసీఆర్ ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించారు. కేసీఆర్ మాటలు విన్న వాళ్లంతా.. బిజెపి కార్యకర్త అందునా మోదీ భక్తుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే కేసీఆర్ మాట్లాడినట్లు అనిపించింది అని బిజెపి వర్గాలు అనుకున్నాయి అంటే అయ్యవార్ల మాట తీరు ఏ తీరుగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు.

‘‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను కానీ నేను మొదటిసారి ఢిల్లీలో అవినీతిరహిత కేంద్ర పాలనను ప్రత్యక్షంగా చూస్తున్నాను. దీనికి మోడీయే కారణం ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేశప్రజలు గుర్తిస్తున్నారు’’ అంటూ మోదీని ఆకాశానికెత్తారు కేసీఆర్. బిజెపితో ముందు నుండి పొత్తుకు దూరంగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు మోదీని మాత్రం అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

‘‘కేంద్రానికి ఉన్న పరిమితులు నాకు తెలుసు, మీరు కూడా ముఖ్యమంత్రిగా చేసినవాళ్లే కాబట్టి ఒక రాష్ట్రం కేంద్రం నుంచి ఎలాంటి సాయం కోరుతుందో మీకు బాగా తెలుసు.నేను రాష్ట్రానికి యాభై వేల కోట్లు ఇవ్వు, లక్ష కోట్లు ఇవ్వు అంటూ అడగను.ఒక ప్రధానిగా ఈ రాష్ట్రంపై మీ ఆశీస్సులు ఉంచండి, మీ ప్రేమ పంచండి. అవసరమున్నప్పుడు కావల్సిన పని చేసిపెట్టండి’’ అంటూ కేసీఆర్ మోదీ వర్షన్ లో కూడా మాట్లాడారు. దాంతో మోదీని ఓ రకంగా వెనకేసుకువచ్చినట్టేవచ్చి..చీమై చక్కెర తిన్నట్లుగా కేసీఆర్ తీరు కనిపిస్తోంది.

‘‘నేను నా చిన్నప్పటి నుంచీ కేవలం వింటూనే ఉన్నాను. హైదరాబాద్- కరీంనగర్ రైలు అనేది ఏనాటి నుంచో మా కలల్లో ఉన్నది ఇప్పుడది మీ చొరవ వల్ల సాధ్యమవుతున్నది’’ అనే ప్రస్తావన ‘‘17 ఏళ్లుగా మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మీ సాయం వల్లే పునరుద్ధరణకు నోచుకుంటున్నది’’ అంటూ మోదీ చేసిన మంచి పనుల చిట్టా ప్రజల ముందు విప్పడం ద్వారా కేసీఆర్ మోదీని అందరి ముందు హీరోను చేశారు.

నిన్నటి దాకా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తగిన విధంగా సహకరించడం లేదు.. నిధులను కేటాయించడం లేదంటూ పెదవి విరిచిన కేసీఆర్.. అదే మోదీని సభలో మాత్రం తన పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బయ్యేట్లు చేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడులాగా ప్రతిసారి దిల్లీకి వెళ్లి మా రాష్ట్రానికి ఇది కావాలి.. ఇది చెయ్యండి అంటూ అర్జీలు పెట్టకుండా.. మోదీని రాష్ట్రానికి పిలిపించి మరీ దిల్ ఖుషీ అయ్యేటట్లు చేశారు. ఎంతైనా కేసీఆర్ చూపించిన సినిమా తెలంగాణలో సూపర్ హీట్ అయింది. మరి దిల్లీలో ఎలా ఉంటుందో చూడాలి.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
చిరుకు పవన్ అందుకే దూరం
ఆ అరుపులేంటి..?
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
ప్రత్యేక హోదా లాభాలు
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
చెత్త టీంతో చంద్రబాబు
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments