తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది

KCR said who will win in 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలపై కూడా పూర్తి నమ్మకంగా ఉన్నారు. గత ఎన్నికల టైంలో తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్ల పూర్తి మెజారిటీ సాధించారు కానీ వచ్చే ఎన్నికల్లో అది ఎంత మాత్రం పనిచెయ్యదు అని వచ్చిన విమర్శలకు ఒక్క స్టేట్ మెంట్ సమాధానమిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తిరిగి మనకే అధికారం దక్కుతుందని పార్టీ శ్రేణులకు కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఏడు, ఎనిమిది సంవత్సరాల వరకు మన ప్రణాళికలు పని చెయ్యాలని, అలా కార్యాచరణ సిద్ధం చేద్దాం అని కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా రొటీన్ గా పనిచేస్తే లాభంలేదని, మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచెయ్యాలని హితవు పలికారు.

తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే కార్యక్రమంపై దృష్టిపెట్టాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టామని తెలిపారు. ఈసారి కురిసిన వర్షాలవల్ల చెరువుల అలల మీద మన బతుకమ్మలు ఆడుతున్నయని వెల్లడించారు. ప్రజలంతా సంబురంగా ఉన్నారని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్ నాటికి కాళేశ్వరం పూర్తవుతుందని,  మేడిగడ్డ బ్యారేజీతో పాటు మల్లన్నసాగర్, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లు పూర్తవుతాయని తెలిపారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలు కాళేశ్వరం ప్రాజెక్టుతో కనెక్ట్ అవుతాయని,  దేవాదులకు నీరిచ్చే తుపాకులగూడెం కూడా పూర్తవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు .  శ్రీసీతారామ ప్రాజెక్టు పూర్తవుతుందని, వీటన్నింటి ద్వారా గోదావరి నీళ్లు మన పొలాల్లో పారుతాయని… అటు కృష్ణా నీళ్లను ఉపయోగించుకోవడానికి పాలమూరు, డిండి లిఫ్టులు పూర్తవుతాయని… నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాదికి పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యుత్ రంగంలోనూ ఎంతో పురోగతి సాధించుకున్నామని అన్నారు. త్వరలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతామని తెలిపారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందుతాయని వెల్లడించారు. టీఎస్‌ఐపాస్, ఐటీ విధానాలవల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని… ఇక మిగిలేది సంక్షేమమే అని.. పేదరిక నిర్మూలనపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది గోడ మీద రాసుందని కేసీఆర్ అన్నారు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
నయీం బాధితుల ‘క్యూ’
రాజీనామాలు అప్పుడే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబు బండారం బయటపడింది
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
సల్మాన్ ను వదలని కేసులు
మంత్రుల ఫోన్లు బంద్
అడవిలో కలకలం
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
బిచ్చగాళ్లు కావలెను
దివీస్ పై జగన్ కన్నెర్ర
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
రాసలీలల మంత్రి రాజీనామా
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments