కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు

KCR started doulbe bed rooms in Erravalli and narsannapet

కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్ ఎలా ఉందో అందరికి తెలుసు. అయితే తెలంగాణ సర్కార్ కు ఎన్నికల్లో తిరుగులేకుండా చేసింది మాత్రం పేదల డబుల్ బెడ్ రూం ఇళ్లు. తాజాగా కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమం జరిగింది. దాదాపుగా 600 డబుల్ బెడ్‌రూం ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. ఇరు గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సుమూహుర్తం 7.53 గంటలకు వేద మంత్రోచ్చారణ నడుమ గ్రామస్తులు గృహప్రవేశం చేశారు.

సరిగ్గా ఏడాది కింద ఇదే రోజున ఘనంగా అయుత చండీయాగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి స్వీకారం చుట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ఈ రెండు గ్రామాల ప్రజలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం పాలితగా ఉండి, స్వయం సమృద్ధి సాధించి, నగదు రహిత గ్రామాలుగా మారి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. మళ్లీ ఒకరోజు ఎర్రవల్లికి వస్తాను.. గ్రామంలో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసి మరిన్ని అభివృద్ధి విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి ఎర్రవల్లికి 395, నర్సన్నపేటకు 200 ఇళ్లు చొప్పున మొత్తం 595 ఇళ్లు మంజూరుకాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీ జరిగింది. ఎర్రవల్లిలో 344 ఇళ్లు, నర్సన్నపేటలో 186 ఇళ్లు మొత్తం 530 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరిగాయి.తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts:
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
స్థూపం కావాలి
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
చంద్రబాబు చిన్న చూపు
నారా వారి నరకాసుర పాలన
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
500 నోటుపై ఫోటో మార్చాలంట
మోదీ మీద మర్డర్ కేసు!
పాపం.. బాబుగారు వినడంలేదా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments