లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట

KCR writing new history with famers blood from Mallanna sagar

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరు, ఆయన ప్రస్తుతం సాగిస్తున్న పరిపాలన అందరికి తెలిసిందే. అయితే తాజాగా కేసీఆర్ కూడా పాత బాటలో నడిస్తున్నాడా.? అనే మాటలు వినిపిస్తున్నాయి. అవును కేసీఆర్ కూడా మరో చంద్రబాబు నాయుడులా మారుతున్నాడా..? కేసీఆర్ కు కూడా అధికార దర్ఫం తలకెక్కిందా ..? కేసీఆర్ ప్రజల నుండి వ్యతిరేకతను స్వాగతించడం లేదా..? కేసీఆర్ ప్రభుత్వం నిరసన గళాన్ని అణగదొక్కుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికి అసలు కారణం ఒక్కటే అదే.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు

తెలంగాణ సర్కార్ ఎంతో కష్టపడి నిర్మించాలని అనుకుంటున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ఆది నుండి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించడం దగ్గరి నుండి అన్ని అంశాల్లో కూడా అన్యాయం చేస్తోందని, ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తోందని దాదాపుగా అర్థమవుతోంది. ఎందుకంటే నిన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు తమ భూముల కోసం ధర్నా చేస్తుంటే పోలీసులు ఏకంగా లాఠీ ఛార్జీ చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. గతంలో రైతుల కళ్లలో ఆనందం వల్ల కన్నీళ్లు రావాలి తప్పితే మరొకటి ఉండదు అని కేసీఆర్ చెప్పిన మాటలకు మల్లన్నసాగర్ నిర్వాసితులు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.

గతంలో ఆంధ్రా పెత్తనం, అన్నింటికి పేచీ ఉండేది కానీ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో అవన్నీ ఉండవు అని అందరూ అనుకున్నారు. అందుకే ప్రాణాలు వడ్డించి తెలంగాణ పోరాటంలో పాలుపంచుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పనులు చూస్తే మాత్రం కేసీఆర్ లోని మరో కోణం కాస్త లేట్ గా తెలుస్తోందా..? అనే అనుమానం కలుగుతోంది. మరోసారి చంద్రబాబు నాయుడు పరిపాలనను కేసీఆర్ గుర్తు చేస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నాడు కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా జనాలు కదనరంగంలోకి దిగితే.. వాళ్లను గుర్రాలతో తొక్కించిన నెత్తుటి చరిత్ర నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి నెత్తుటి చరిత్రలకు మల్లన్న సాగర్ నుండే శ్రీకారం చుట్టినట్లున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు న్యాయం కోసం రోడ్డెక్కితే ఏకంగా లాఠీలతో కొట్టించడం కేసీఆర్ సర్కార్ కు ఎన్నటికీ మాయని మచ్చే. మసి పూసి మల్లన్న సాగర్ ను నిర్మించాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నానికి నోట్లో వెలగపండులా మారనుంది మల్లన్న సాగర్ కల. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో సర్కార్ తీరు మల్లన్న సాగర్ వద్ద మాత్రం మారింది. అందుకే ముందు ముందు కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొవలసి వస్తుందేమో చూడాలి.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
పవన్ ను కదిలించిన వినోద్
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
పవన్ క్షమాపణలు చెప్పాలి

Comments

comments