దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?

Kerala Girl Challenge Narendra Modi on that Matter

నరేంద్ర మోదీ.. ఇప్పుడు దేశం మొత్తం వినిపించిన ఓ పేరు.. అంతకు మించిన భారత్ బ్రాండ్. అవును విదేశాల్లో భారతదేశం గురించి భారీ ప్రసంగాలతో, అక్కడి వారిని ఆకట్టుకుంటూ.. నా దేశం బాగుపడుతోంది అంటూ లెక్చర్లు ఇస్తున్నారు. అలాంటి మోదీ ఎన్నో ఛాలెంజ్ లను ఎదుర్కొని ఇప్పుడు మంచి పరిపాలనను అందిస్తున్నారు.దేశంలో తాను అధికారంలోకి రాకముందు ఉన్న అనేక సమస్యలను ఛాలెంజింగ్ గా తీసుకొని మోదీ… వాటిని సాధించారు. దేశంలోకి ఎఫ్డిఐల రాకను భారీగా పెంచి దేశ ఆర్థికవ్యవస్థకు మంచి చేస్తున్నారు. కాగా తాజాగా కేరళకు చెందిన ఓ అమ్మాయి మోదీకి ఛాలెంజ్ విసిరింది. అయితే అది దేశానికి మంచి చేసే ఛాలెంజ్ కావడం.. అమ్మాయి ఆ ఛాలెంజ్ గురించి చెప్పిన విధానం అందరిని ఆలోచనలో పడేశాయి.

కేరళకు చెందిన ఓ పదో తరగతి చదువుతున్న అమ్మాయి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విసిరిన ఛాలెంజ్.. నిజానికి దేశానికి పట్టిన ఓ సమస్య. మత్తుమందులకు, మత్తుపానీయాలకు, ధూమపానానికి ఎంతో మంది బానిసలుగా మారుతున్నదానిపై ఆ అమ్మాయి ఛాలెంజ్ చేసింది. ప్రపంచంలో యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ ఎదుగుతోంది. అందుకే ప్రపంచదేశాలు మన మీద ప్రత్యేక దృష్టిసారించాయి. మరి అలాంటి యువతనే టార్గెట్ చేస్తూ వస్తున్న డ్రగ్స్, మత్తుతో కూడిన మిగిలిన వస్తువులు ఎంతలా నష్టపరుస్తున్నాయో తెలియనిది కాదు. అలాంటి వాటిని ఎందుకు మీరు నిషేదించలేరు అని ఆమె ప్రశ్నించింది.

ఓ సిగరెట్ ప్యాకెట్ పై ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్ కు కారకం అని రాసి ఉంటుంది. కానీ అదే సిగరెట్ ను దేశంలో అమ్ముకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఎందుకు..? కేవలం వాటి మీద వచ్చే ట్యాక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తోంది ప్రభుత్వం.కానీ యువతను ఇలాంటి వాటికి దూరంగా ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా చేస్తారు… అలా ఉంటే అంతకన్నా చేసేదేముంది. దేశం దూసుకెళ్లడం ఖాయం కదా.. కానీ ఇలా మత్తుమందులతో పాటుగా, స్మోకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ను ఎందుకు బ్యాన్ చెయ్యరు అని ఆమె తన స్టైల్లో ప్రశ్నించింది.

ఇక స్మగ్లింగ్ జరిగింది.. డ్రగ్స్ దొరికాయి అని వార్తను మీడియా వాళ్లు ప్రజెంట్ చేసే విధానాన్ని కూడా ఆ అమ్మాయి అడిగింది. మీడియా అంటే అడ్వర్టైజింగ్ కంపెనీల్లాగా మారాయి అని విమర్శించింది. ఎందుకంటే ఎక్కడి నుండి డ్రగ్స్ వస్తున్నాయి.. ఎలా వస్తున్నాయి అని చాలా బాగా ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. వేల కోట్ల రూపాయలు పెట్టి.. కంపెనీలు పెడుతున్నాం అని ఘనంగా చెప్పుకునే ప్రభుత్వాలు దేశంలో యువతను ఎందుకు పాడుచేస్తున్నాయి..? అందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి..? డ్రగ్స్ తో సహా అన్నింటిని బ్యాన్ చెయ్యాలి. వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని తెలిసినా కూడా ఎందుకు అనుమతిస్తోందని నిలదీసింది.

కేరళలోని త్రిస్సూర్ కు చెందిన ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలు నిజంగా అందరికి ఆలోచనను రేకెత్తించాయి. తన తండ్రి వల్ల ఈ డ్రగ్ వ్యతిరేక పోరులో పాలుపంచుకుంటున్న చిన్నారి.. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు ఉంది. ఆరు నిమిషాల వీడియోను తీసి.. డ్రగ్స్ మీద ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా పంపించింది. పిఎంఓకు కూడా ఈ వీడియోను మెయిల్ చేసింది. సోషల్ మీడియాలో కూడా దీని మీద తీవ్ర చర్చ సాగుతోంది. ఏదో చిన్నారి ఆస్పత్రికి సహాయం చేశారు.. మోదీ అని పిఎంఓ నుండి వచ్చే వార్తల కన్నా కూడా ఇలాంటి వాటి మీద మోదీ స్పందిస్తారు అనో లేదంటే చర్యలకు దిగారనో వార్తలు రావాలి. కానీ మోదీకి నిజంగా ఈ చిన్నారి ఛాలెంజ్ ను తీసుకొని దేశం నుండి డ్రగ్ మహమ్మారిని, మిగిలిన అవలక్షణాలను యువత నుండి దూరం చేసే సత్తా ఉందా..? అవును ఉంది అని అంటే మాత్రం వెంటనే దీని మీద చర్యలకు దిగాలి.. యువతకు విముక్తి కలిగించాలి.

-Abhinavachary

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
దిగజారుతున్న చంద్రబాబు పాలన
బతుకు బస్టాండ్ అంటే ఇదే
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
తిరిగబడితే తారుమారే
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్

Comments

comments