ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి

Khammam Accident in Telangana

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద కాలువలోపడింది. 31 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సు సాగర్ ఎడమ కాలువ ఇన్ ఫాల్ రెగ్యులేటర్ పై నుంచి కాలువలో పడింది. ఈ సంఘటనలో 10 మంది మరణించారు. 18 మంది గాయపడ్డారు. స్థానిక మత్స్య కారులు బస్సులోనుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి మూడు అంబులెన్సులలో తరలించారు. ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఖమ్మం పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ సంఘటనా స్థలాన్ని పరీశీలించారు. బాధితులను జగన్ పరామర్శించారు. కాగా ఏపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మూడు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు నాయుడు. మరోపక్క ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బాధితులను పరామర్శించారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Jagan-at-Khammam

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
ముద్రగడ సవాల్
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అమ్మకు ఏమైంది?
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
అడవిలో కలకలం
జగన్ సభలో బాబు సినిమా
నారా వారి నరకాసుర పాలన
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ

Comments

comments