కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత

Khammam Police took chicken into custody

తెలుగులోగిళ్లలో ఇప్పటికి చాలా మందికి కోడికూత కూస్తేనే తెలవారుతుంది. అలాంటి కోడి గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఓ కోడి గురించి అందరూ వార్తల్లో వింటున్నారు. ఆ కోడికి పాపం ఆ పరిస్థితి ఏంటో అని కొంత మంది అంటే.. మరికొందరు మాత్రం వాళ్లు చేసిన తప్పుకు కోడిని ఎందుకు శిక్షిస్తున్నారు అని బాధపడిపోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే ఓ కోడిని పోలీసులు పట్టి కటకటాల వెనక్కి తోసేశారు. అవును.. మీరు అనుకుంటున్నది నిజమే పోలీసులు కోడిని పోలీస్ స్టేషన్ లో బందించారు. అయ్యో పోలీసోళ్లను  ఏమైనా డిస్ట్బ్రబ్ చేసిందా అని అనుకుంటున్నారేమో కానీ కాదు.. మ్యాటర్ వేరే ఉంది.

పొలం గట్ల వెంట మేత మేసే తనకు జీడి పప్పు, బాదం పప్పులు తినిపించిన యజమాని కోరి క మేరకు మరో పుంజుతో తలపడడమే నేరమైంది. మీరు ఊహించింది నిజమే.. పందెంరాయుళ్లు ఆడించినట్టుగా ఆడడమే ఇది చేసిన తప్పు. అందుకే ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో బందీగా ఉంది. ఆదివారం ఖమ్మం నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాల వెనుకాల కోడిపందేలు ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు స్థావరంపై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పందెరాయుళ్లు తప్పించుకున్నారు. కానీ కోడిపుంజు కంటపడడంతో పట్టుకొచ్చి లాకప్‌లో పడేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు లాకప్‌లోనే ఉంచడంతో సమాచారం తెలిసి విలేకరులు వెళ్లారు. ఫొటోలు తీసే ప్రయత్నం చేస్తుండగా లాకప్‌లో ఉన్న కోడిపుంజును బయటకట్టేశారు. ఎలాంటి పైరవీ చేసుకోలేని కోడిపుంజుకు ఏ శిక్ష విధిస్తారో? చూడాలి మరి. పాపం కోడికి వచ్చిన దుస్థితికి ఎవరు మాత్రం ఏం చేస్తారులెండి.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఆట ఆడలేమా..?
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
స్టే ఎలా వచ్చిందంటే..
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
బాబు బండారం బయటపడింది
అడవిలో కలకలం
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం

Comments

comments