తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

KrishnamRaju may appoints as Tamilnadu Governor

కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించే విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసినప్పటి నుండి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు తమిళనాడు గవర్నర్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నందున అక్కడ పూర్తి స్థాయి గవర్నర్ ఉండటం మంచిదని భావిస్తున్న ఎన్‌డిఏ ప్రభుత్వం కృష్ణంరాజుతో పాటు మరో ఇద్దరి పేర్లను పరిశీలిస్తోందని అంటున్నారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపి రెబల్‌సార్ట్ కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి సిహెచ్ విద్యాసాగర్ రావు ఇంచార్జీ గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన స్థానంలో కృష్ణంరాజుని నియమించన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయలో ఆయన కేబినెట్‌లో కృష్ణంరాజు సహాయమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కృష్ణంరాజు గవర్నర్ బాధ్యతలు స్వీకరిస్తే గవర్నర్ పదవి చేపట్టిన తొలి సినిమా వ్యక్తి ఆయన చరిత్ర సృష్టిస్తారు.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఓటుకు నోటు కేసును మూసేశారా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments