హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది

KTR fears with Rains in Hyderabad

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదేగా మరి. హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకు రావడం ఏంటి..? జోక్ కాకపోతే అనుకుంటున్నారా.?కానే కాదు అక్షరాల వాస్తవం. కేటీఆర్ కు వణుకు, భయం, కోపం అన్ని వస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వార్తలతో ఎక్కడి రోడ్లు గోతులతో గతుకులమయంగా మారాయి. ప్రధాని దారుల దగ్గరి నుండి చిన్న చిన్న మార్గాలు కూడా ఇందుకు మినహాయింపుకాదు. పంజాగుట్ట నుండి బాలానగర్ వరకు, ఉప్పల్ నుండి దిల్ సుఖ్ నగర్ వరకు, శంషాబాద్ నుండి ఆరాంఘర్ వరకు ఇలా ఏ రూట్ లో చూసినా కానీ రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి.

గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మారుస్తాం… అంటూ అధికారంలోకి తెచ్చిన కేటీఆర్ కే టెన్షన్. చిన్న చిన్న వర్షానికి సైతం రోడ్లు చిద్రంకావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, కేటీఆర్ లు కలిసి పరిస్థితి మీద సమీక్ష నిర్వహించారు. మెట్రో రైలు పుణ్యమా అని ఇప్పటికే సగం రోడ్లు కొట్టుకుపోతే, వర్షంతో మిగిలిన రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. పైగా ఇప్పుడు నాళాలు నోళ్లు తెరిచి కూర్చున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ లో డ్రైనేజి వ్యవస్థ గురించి వ్యంగ్యంగా మాట్లాడాలంటే పై విధంగా మాట్లాడవచ్చు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగర పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో వాహన దారులు నరకం చూస్తున్నారు. రోడ్లన్నీ చిన్నపాటి సెలయేరులుగా మారిపోయాయి.ఈ విషయం లో అందరికంటే ఎక్కువ దిగులు చెందుతోంది కేటీఆరే. ఎందుకంటే ఆయనే మున్సిపల్ శాఖామంత్రి. పైగా గత ఎన్నికల్లో హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తా.. నన్ను నమ్మండి అంటూ తెగ ప్రచారం నిర్వహించారు. మరి ఆ బాధ్యత ఖచ్చితంగా కేటీఆర్ మీదే ఉంటుంది.

కానీ పరిస్థితులేమో ఎవరి చేతిలో లేవు. గత కొన్ని రోజులుగా మీడియాకి హైదరాబాద్ డ్రైనేజి గురించి వివరణ ఇవ్వడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు.చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు అద్వానంగా మారుతున్న విషయం తాను అంగీకరిస్తామని అన్నారు. హైదరాబాద్ డ్రైనేజి వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాకపోతే ఆ పనిని దశలవారీగా చేస్తామని అన్నారు. మరోపక్క ఎన్టీఆర్ గార్డెన్ వద్ద రోడ్డు కుంగిపోవడం అందరికి షాకిచ్చింది. సెక్రటేరియట్ కు కూత వేటు దూరంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు హుటాహుటిన స్పందిస్తున్నారు. కానీ మొత్తానికి వర్షం హైదరాబాద్ కు కష్టాలు తెచ్చింది అని అందరికి తెలుసు.. కానీ అంతకన్నా ఎక్కువ కష్టాలు కేటీఆర్ కు తెచ్చింది అన్నది మాత్రం వాస్తవం. మరి దీన్ని కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాలి.

This slideshow requires JavaScript.

 

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
గుజరాత్ సిఎం రాజీనామా
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
బిచ్చగాళ్లు కావలెను
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
మోదీ మీద మర్డర్ కేసు!
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments