చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?

KTR gave clarity on Why Chandrababu Naidu leaves Hyderbad

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో గతంలో పాగా వేసినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం తెలంగాణను విడిచివెళ్లిపోయారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత  చంద్రబాబు నాయుడు తన ఓటును ఏపికి మార్చుకోవడంతో పాటు మొత్తం సెటప్ ను అమరావతికి మార్చేశాడు. తెరాస సర్కార్ ధోరణితో హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారని, వారి కోసమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించుకొనే వరకు హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తానని చెప్పిన చంద్రబాబు, వారినీ తన పార్టీని కూడా విడిచి పెట్టేసి హడావుడిగా ఆంధ్రాకి తరలివెళ్ళిపోవడం అందరూ చూశారు.

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసుకి భయపడే హడావుడిగా విజయవాడ తరలిపోయారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ మంత్రి కేటిఆర్ కూడా ఆయన ఓటుకి నోటు కేసుకి భయపడి హైదరాబాద్ విడిచి వెళ్ళిపోలేదని చెప్పడమే విశేషం.“చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసుకి భయపడి హైదరాబాద్ విడిచిపెట్టి విజయవాడ తరలి వెళ్ళిపోయారనే వాదన సరైనది కాదు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత, ఇక రాష్ట్రంలో తెదేపా మనుగడ సాధించే అవకాశం లేదని గ్రహించి మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక వచ్చే ఎన్నికలలో మేము అవశేష కాంగ్రెస్ పార్టీతోనే పోటీ పడవలసి ఉంటుంది’’ అని అన్నారు. మొత్తానికి కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు హైదరాబాద్ విడిచివెళ్లారు అన్నదానిపై జనాలు అనుకుంటున్న దానికి భిన్నంగా సమాధానమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
అమెరికా ఏమంటోంది?
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
అకౌంట్లలోకి 21వేల కోట్లు
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
వార్దాకు వణికిపోతున్న చెన్నై
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ

Comments

comments