వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్

KTR respond on Nallagonda social Media video

సోషల్ మీడియాలో టిఆర్ఎస్ నాయకుడి అరాచకం అంటూ ఓ వీడియో గత రెండు రోజులుగా తెగహడావిడి చేస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రిగారి అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి దౌర్జన్యాన్ని వీడియోలో బంధించారు. కాగా దీనిపై ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించగా తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘సూర్యాపేటలో తెరాస నాయకుడిగా చెప్పుకుంటూ.. సదరు వ్యక్తి పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వీడియోలో తెరాస నాయకుడని చెప్పుకుంటున్న వ్యక్తి అసలు తెరాసకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్‌ రెడ్డి నిర్ధారించినట్లు కేటీఆర్‌ తన ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు, సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మను కోరుతున్నట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దానికి స్పందించిన డీజీపీ.. నిందితుడిని అరెస్టు చేసినట్లు, కేసు నమోదు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రిపోర్ట్ చేసినట్లు వెల్లడించారు.

KTR tweet

సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తాను తెరాసకు చెందిన నాయకుడిగా చెప్పుకుంటూ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఈ నాయకుడు ఉద్యోగాలు ఇప్పించలేడంటూ వ్యాఖ్యలు చేశారు. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఆ యువకులను తన కార్యాలయంలోకి పిలిపించి వారిపై దాడికి దిగాడు. ఈ తతంగాన్నంతా వీడియో ద్వారా ఓ మీడియా ప్రతినిధి తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

Related posts:
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
అతడికి గూగుల్ అంటే కోపం
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
బాబోయ్ బాబు వదల్లేదట
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments