కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం

KVP Help for KCR on GO123

కేవీపీ.. ఏపిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన నేత. వైసీపీ ఎంపీగా ఉన్న కేవీపీ పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్ ను ప్రతిపాదించిన ఎంపీ. ఎంతో కాలంగా ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారానికి తెర దించుతూ కేవీపీ బిల్ ను ప్రవేశపెట్టడంతో రాజకీయం మారిపోయింది. విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడటం జరిగిపోయాయి. కాగా కేవీపీ తెలంగాణ సిఎం కేసీఆర్ కు సహాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా 123 సహాయం అట. అసలు కేవీపీ కేసీఆర్ కు ఎందుకు సహాయం చేశారు..? ఏ విషయంలో సహాయం చేశారో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

తెలంగాణ సర్కార్ కు తాజాగా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తెలంగాణవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తోంది. కాగా టిసర్కార్ కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం2013 ప్రకారం కాకుండా జీవో 123ని తీసువచ్చింది. దానిపై కోర్టుకు వెళ్లడంతో దీన్ని హైకోర్ట్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా హైకోర్టులో తెలంగాణ సర్కార్ తరఫున లాయర్లు సరిగ్గా వాదించకపోవడం వల్లే కేసు ఓడిపోయినట్లు కేసీఆర్ తన సన్నిహితులతో అన్నట్లు గుర్తు. అప్పటికే ప్రత్యేక హోదా అంశంపై సీరియస్ వర్క్ చేస్తున్న కేవీపి వెంటనే దిల్లీ నుండి నలుగురు లాయర్లను హైదరాబాద్ కు కేసీఆర్ వద్దకు పంపించారట.

వెంటనే హైదరాబాద్ కు చేరుకున్న కేవీపీ పంపిన లాయర్లు కేసీఆర్ తో మూడు గంటలపాటు చర్చించారట. తర్వాత దీనిపై అప్పీలుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఓ పక్క ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో అలజడికి కారణమైన కేవీపీ ఇప్పుడు తెలంగాణకు కూడా సహాయం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మరో గాలి వార్త కూడా పొలిటికల్ సర్కిల్స్ లో సంచనలం రేపుతోంది. మిషన్ భగీరథ ప్రాజెక్టును కేవీపీ సన్నిహితుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కేసీఆర్ అప్పగించిన కారణంగా కేవీపీ ఈ సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
గులాబీవనంలో కమలం?
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments