లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్…. చైనా మీడియా విపరీత ధోరణి

Lashkar-e-taiba is a military troop said China media

చైనా ధోరణి గురించి అందరికి తెలుసు. పక్క దేశమైన భారత్ మీద ఎప్పుడూ పక్షపాతవైఖరి అవలంబిస్తోంది. పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పడానికి భారత్ పూనుకుంటే దానికి అడ్డుపుల్లలు వేస్తే చైనా నిత్యం పాక్ కు అండగా నిలుస్తోంది. పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేందుకు, సింధు నదీ జలాల మీద కావాలని భారత్ పేచీపెడితే పాకిస్థాన్ కు బాసటగా,. భారత్ కు ఇబ్బంది కలిగే చర్యలకు దిగింది చైనా.

సార్క్ సభ్య దేశాల సమావేశంలో కూడా ఉగ్రవాదానికి తాము వ్యతిరేకంగా అని ప్రకటించి,భారత్ దాటిపోగానే వెంటనే పాకిస్థాన్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని, ఉగ్రవాద నిర్మూలనలో పాక్ ఎంతో కృషి చేస్తోందని చైనా ప్రకటించింది. ఇలా భారత్ కు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్న చైనా తాజాగా మరో ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ముందు నుండి చైనా పాకిస్థాన్ కు బాహాటంగానే మద్దతు తెలుపుతోందని తెలిసినా, ఇలాంటి ప్రకటన వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇంతకీ ఏంటా ప్రకటన అనుకుంటున్నారా..? అయితే మొత్తం చదవండి.

పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఎ-తయిబా ఉగ్రవాద సంస్థను అక్కడి మీడియా సైనిక గ్రూప్ గా ప్రకటించింది. పాకిస్థాన్ ఆర్మీ మాదిరిగా లష్కర్-ఎ-తాయిబా ఓ సైనిక గ్రూప్ అంటూ చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యం కలిగించింది. లష్కర్-ఎ-తయిబా పాకిస్థాన్ కు చెందిన సైనిక గ్రూప్‌ అని గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అంతేకాదు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్‌ను సైనిక కమాండర్‌గా అభివర్ణించింది. నిషేధిత ఉగ్రవాద జాబితాలో ఆయన్ను చేర్చాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ డిమాండ్ చేస్తోందని విమర్శించింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో భారత్ కు చోటు దక్కకపోవడం వల్లే భారత్ చైనా మీద అక్కసు వెల్లగక్కుతోందని ఆ మీడియా విమర్శలు కూడా గుప్పించింది. అయినా చైనా కుక్క బుద్ధి గురించి మనకు తెలియనిదా..? ఏంటి?

అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని బలమైన దేశాల్లో ఒకటిగా ఉన్న చైనా, తన అధికారాన్ని తప్పుడు ఉద్దేశాలకు వాడుకుంటోంది. భారత్ తనకు పోటీగా మారిందనే ఉద్దేశంతో అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్ కు అన్ని విధాలుగా సహకరిస్తున్నా చైనా మాత్రం అన్నింటా అడ్డుపడుతోంది. పాకిస్థాన్ లో ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలనే డిమాండ్ దగ్గరి నుండి పాక్ ను రక్షణవిధానంలో ఎదుర్కొనే వరకు భారత్ కు అడ్డుపుల్లగా మారింది. పాక్ ఉగ్రవాదులను సైనికులుగా చైనా మీడియా అభివర్ణించడంలోనే దాని అసలు ఉద్దేశం ఏంటో తెలిసిపోతోంది.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ప్యాకేజీ కాదు క్యాబేజీ
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
ఏపీకి ఆ అర్హత లేదా?
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
చెబితే 50.. దొరికితే 90
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
బంగారం బట్టబయలు చేస్తారా?
ఒక్క రూపాయికే చీర
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు

Comments

comments