వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే

Leaders from All parties joining into YSRCP

ఏపిలో వైసీపీ అధినేత చల్లగా తన పని తాను చేసుకుంటూపోతున్నారు. ఓ పక్క పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూనే, ప్రభుత్వం చేస్తున్న తప్పులను వేలెత్తిచూపుతున్నారు. అదేటైంలో అధికార పార్టీ వల్ల విసిగిపోయిన లేదంటే విపక్షాల్లో సర్దుకోలేని వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గతకొంత కాలంగా వైసీపీలో వలసల పర్వం బాగా ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతను వైయస్ జగన్ వలసల ద్వారా పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు అనేదాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. తాజాగా జరుగుతున్న వలసలతో తెలుగు తమ్ముళ్లలో మరింత భయం పట్టుకుంది.

తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శీనన్నను కళ్లలో పెట్టిచూసుకుంటాం అన్న వ్యాఖ్యలు వెల్లంపల్లి శ్రీనివాస్‌ అనుచర వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి. అలాగే వచ్చిన ప్రతి కార్యకర్తతో ఆయన మాట్లాడిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

కాగా వైసీపీలోకి గత కొంత కాలంగా చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అధికారపక్ష నాయకులు వైసీపీ పార్టీలోకి చేరుతుంటే ఇప్పుడు మిగిలిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కూడా చేరుతుండటం అక్కడి రాజకీయ సమీకరణలను మారుస్తోంది. అంతకు ముందు తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వైఎస్ఆర్‌సీపీలో చేర‌గా, ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు.

చంద్రబాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిందేంటీ? అధికారంలోకి వ‌చ్చాక చేస్తుంది ఏంట‌నీ జ‌నం నిల‌దీస్తున్నార‌ని, ఇందుకు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ చేరిక‌నే నిద‌ర్శ‌న‌మ‌న్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్. రాష్ట్ర రాజ‌ధాని కేంద్ర‌మైన విజ‌య‌వాడ‌లో పార్టీ బ‌లోపేతం కోసం శ్రీ‌నును పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు, ఆయ‌న్ను కుటుంబ స‌భ్యుడిలా గుండెల్లో పెట్టుకుంటాన‌ని చెప్పారు. బాబు స‌ర్కార్‌ను బంగాళ‌ఖాతంలో క‌లిపే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉందన్నారు. బాబును నిల‌దీసేందుకు జ‌నం సిద్ధ‌మ‌య్యార‌ని, త్వ‌ర‌లోనే ఇది దావ‌ానంలా వ్యాపిస్తుంద‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
సైన్యం చేతికి టర్కీ
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఆటలా..? యుద్ధమా..?
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
వంద, యాభై నోట్లు ఉంటాయా?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
యాహూ... మీ ఇంటికే డబ్బులు

Comments

comments