వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు

Leaders joining YSRCongress Party

గత ఎన్నికల తర్వాత ఏపిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపి సర్కార్ చేస్తున్న తప్పులకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బలికావాల్సివచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడి.. జగన్ పార్టీలో చేరుతున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీల నుండి నేతలు వరుసగా క్యుకట్టారు. దాంతో జగన్ వ్యతిరేక ముఠాలో దీనిపై చర్చలు మొదలయ్యాయి.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వైసీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మక్షంలో పార్టీలో చేరారు.  కాగా రేపు  వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌వ‌ర్గంలోని సంజ‌మ‌ల మండ‌లంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి స‌మ‌క్షంలొ వైఎస్ఆర్‌సీపీలో చేరాయి. ఇదే వారంలో రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లువురు ముఖ్య‌నేత‌లు కూడా ప్ర‌తిప‌క్ష పార్టీలో చేర‌నున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అధికార పార్టీ నేత‌లు సైతం ఇలా ప్ర‌తిప‌క్ష పార్టీలో చేర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీ స‌ర్కార్ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో విఫ‌లం కావ‌డం వ‌ల్లే మూడేళ్ల‌కే వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి పలానా పార్టీ అని కాకుండా అధికారపార్టీతో సహా అన్ని పార్టీల నుండి నాయకులు జగన్ తో కలిసి ముందుకు కదిలేందుకు వైసీపీలో చేరుతున్నారు. దీన్ని దగ్గరి గమనిస్తున్న వారు మాత్రం జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి విజయాన్ని పొందబోతున్నారో ముందుగా గ్రహించిన నాయకులు, తెలుగుదేశంతో సహా తమ పార్టీలకు హ్యాండిచ్చి వైసీపీలోకి చేరుతున్నారని అంటున్నారు.

Related posts:
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
సైన్యం చేతికి టర్కీ
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
నయీం రెండు కోరికలు తీరకుండానే...
జగన్ అన్న.. సొంత అన్న
ముద్రగడ సవాల్
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
మావో నాయకుడు ఆర్కే క్షేమం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
జియో భారీ ఆఫర్ తెలుసా?
500 నోటుపై ఫోటో మార్చాలంట
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి

Comments

comments