ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?

ysrcp

కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు నీటి మాటలలో పోలవరం ప్రాజెక్టు దానికి అవసరమైన నిధుల గురించి మాట్లాడుతోంది. అసలు ప్రత్యేక హోదాకి గాని, ప్రత్యేక ప్యాకేజీకి గాని, ప్రత్యేక సహాయానికి గాని పోలవరంకి సంబంధం లేదు. వీటన్నింటికి అతీతంగా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న మహత్తరమైన ప్రాజెక్ట్ ఇది. దీనిని లెక్కలలో కలిపి చూపించడం సరికాదు. ఎందుకంటే..

1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి. అంజయ్య గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అప్పటినుండి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యేవరకు ఈ ప్రాజెక్ట్‌కి ఎటువంటి మోక్షం కలుగలేదు. కరువు కాటకాల వలన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులను పక్కనబెట్టి వారిని వేరే పనులు చూసుకోమని చెప్పి ఇన్‌‌ఫర్మేషన్ టెక్నాలజీ మీద దృష్టి పెడితే వై.ఎస్.ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకోసం జలయజ్ఞం పేరుతో నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి సారించడం జరిగింది. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ కి కావాల్సిన అన్ని పర్మిషన్లను యుద్ధప్రాతిపదిక పైన తెప్పించుకోవడం జరిగింది.

అది ఏ విధంగా అంటే.. ప్రాజెక్ట్ సైట్ క్లియరెన్స్‌ను 19 సెప్టెంబర్ 2005లో కేంద్రం నుండి తెచ్చుకున్నారు. ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌ను 25 అక్టోబర్ 2005లో, R & R క్లియరెన్స్‌ను 15 ఏప్రిల్ 2007లో, వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ క్లియరెన్స్‌ను 19 సెప్టెంబర్ 2008లో, ఫారెస్ట్ క్లియరెన్స్‌ను 26 డిసెంబర్ 2008లో, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్‌ను 20 జనవరి 2009లో తెచ్చుకున్నారు. అదే విధంగా ఎన్నోసార్లు పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్ కింద గుర్తించాలని డిమాండ్ చేసేవారు. ఆ తరువాత వై.ఎస్.ఆర్ ఆకస్మిక మరణాంతరం 2013లో ఏపీ స్పెషల్ Re-Org Act కింద పోలవరంని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడం జరిగింది. అయితే దీనిని పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వం భాద్యత కాదా? ఇది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు ఏపీకి సహాయం చేయడం ఏమిటి? ఏపీ ప్రజలని మబ్యపెడుతూ ఏపీ ప్రత్యేక ప్యాకేజీలో దీనిని చూపించడం ఏమిటి? ప్రతి ఒక్క ఆంధ్రుడు, రాజకీయ నేతలు, మేధావులు ప్రశ్నించాల్సిన విషయం. ఈ ప్రాజెక్ట్‌ను ఆర్ధికమంత్రి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చూపించవలసి ఉంటుంది.

Related posts:
అమావాస్య చంద్రుడు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments