అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు

Lord Rama in past and now KCR

అదేంటి రాముడు, కేసీఆర్ ఫోటోలు పెట్టి.. అప్పడు రాముడు ఇప్పుడు చంద్రుడు అని టైటిల్ పెట్టారు ఏంటి అని అనుకుంటున్నారా..? రాముడికి, కల్వంకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓ చిన్న కనెక్షన్ కుదిరింది అందుకే అప్పుడు రాముడు ఇప్పుడు చంద్రుడు అని టైటిల్ ఫిక్స్ కావాల్సి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే.. కేసీఆర్ చేసిన రెండు పనులు రామయణంలో రాముడి క్యారెక్టర్ ను గుర్తు చేస్తున్నాయి. ఆ రెండు ఘటనలు కూడా పర్ ఫెక్ట్ గా రాముడికి సూట్ అవుతున్నాయి. ఇంతకీ ఆ రెండు ఘటనలు ఏంటి అనుకుంటున్నారా..?

అక్కడ వాలి – ఇక్కడ రేవంత్ రెడ్డి
రామాయణ కాలంలో రాముడు సుగ్రీవుడికి అభయమిస్తాడు. సుగ్రీవుడు తన సోదరుడైన వాలి మీద ఎన్నిసార్లు యుద్ధం చేసినా కానీ గెలవలేకపోతాడు. అయితే తనకు సహాయం చెయ్యాల్సిందిగా సుగ్రీవుడు రాముడిని కోరుతాడు. దాంతో రాముడు రంగంలోకి దిగి వాలిని చెట్టుచాటు నుండి హతమారుస్తాడు. అయితే ఇప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని నేరుగా కాకుండా ఓటుకు నోటు కేసులో ఇరికించారు. ఇక్కడ కేసీఆర్ రాముడిలాగా చెట్టుచాటునుండి(ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ ద్వారా) రేవంత్ రెడ్డి మీద దాడికి దిగాడు. అందుకే వాలి విషయంలో రాముడు ఎలా అయితే చేశాడో రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ కూడా అలానే చేశాడు అని అనిపిస్తోంది.

అప్పుడు రావణుడు- ఇప్పుడు నయీం
రాక్షస రావణుడి మీద రాముడు ఎలా అయితే మట్టుబెట్టాడో ఇప్పుడు కేసీఆర్ రావణుడిలాంటి నయీంను అలానే హతమార్చాడు. నాడు లోకకల్యాణం కోసం రాముడు రావణుడిని హతమార్చినట్లే.. గ్యాంగ్‌స్టర్ గా ఎంతో మందికి అన్యాయాలు చేసిన నయీంను కేసీఆర్ ప్రజల కోసం హతమార్చాడు. నయీం చేసిన కిరాతకాలకు ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అందుకే కేసీఆర్ నయీంను ఎన్ కౌంటర్ లో చంపేశాడు. ఇక్కడ ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటే అప్పుడు కేసీఆర్ ఎలాగైతే లోకకళ్యాణ్ కోసం చేశాడో.. తెలంగాణ కళ్యాణం కోసం కేసీఆర్ కూడా అలా చేశారు. మొత్తానికి కేసీఆర్ ను ఆయన అభిమానులు రాముడితో పోల్చుకోవచ్చు. ఏది ఏమైనా కానీ కేసీఆర్ నయీంలాంటి గ్యాంగ్‌స్టర్ ను చంపడం మాత్రం ఎంతో మంచే చేసింది.

రవణాసురుడి మీద రాముడి విజయం చెడుపై మంచి విజయం. అలాగే గ్యాంగ్ స్టర్ నయీంను మట్టుబెట్టడం కూడా చెడుపై మంచి విజయం.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
జీఎస్టీ బిల్ కథ..
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
అన్నదమ్ముల సవాల్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
మద్యల నీ గోలేంది..?
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
తొక్కితే తాటతీస్తారు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments