యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది

Lucky lady got one crore rupees

అదృష్టలక్ష్మి ఎప్పుడు ఎవరినివరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మరి అలాంటి వాళ్లను అదృష్టవంతుల కన్నా ఎక్కువే అని చెప్పాలి. కేవలం యాభై రూపాయలు పెట్టి కోటి రూపాయల లక్కీ డ్రా వచ్చింది అంటే అమ్మగారికి అదృష్టం ఏరేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. కోటి రూపాయల లాటరీ తగిలింది అంటే నమ్మని ఆమె తర్వాత తేరుకొని సంతోషపడింది. లక్ వచ్చి లక్కబంకలా అతుక్కోవడం అంటే ఇదే మరి. ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరో  తెలుసా..? ఏం చేస్తుందో తెలుసా..?

కేరళలో ఓ రబ్బరుతోటలో పని చేసే  నబీసా అనే ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం బంకచెక్కగా అతికింది. అందుకే అక్కడి ప్రభుత్వ లాటరీలో ఆమె కోటి రూపాయలు గెలుచుకుంది. 11వ ‘స్త్రీ శక్తి’ లాటరీ ద్వారా ఈ మొత్తాన్ని గెలుచుకుంది. నబీసా తిరువనంతపురం జిల్లాలోని కిలిమనూరు నివాసి. ఈమె ప్రతి ఏటా ప్రభుత్వం తరపున అమ్మే లాటరీ టిక్కెట్లను కొంటూ ఉంటుంది. తన అదృష్టాన్ని ఎప్పటికప్పుడూ పరీక్షించుకుంటూ ఉంటుంది. ఇలా ఆమె చాలాసార్లు వెయ్యి రూపాయలు గెలుచుకుంది.

కానీ ఈ సారి ఏకంగా కోటి రూపంలో అదృష్టం తలుపుతట్టింది. గెలుచుకున్న డబ్బుతో కొంత భూమి కొని, సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. వికలాంగురాలైన తన చెల్లెలికి స్టేషనరీ షాప్ పెట్టిస్తానని చెప్పింది. ఈ లాటరీని గతంలో యుడిఎఫ్ ప్రభుత్వం నిరుపేద మహిళల సహాయార్థం ఆరంభించింది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా వారానికి ఒకసారి డ్రా తీసే ఈ లాటరీ టికెట్ ధర రూ.50. ఈ టిక్కెట్ల ద్వారా సేకరించిన డబ్బుని ప్రభుత్వం ప్రత్యేకంగా వృద్ధులు, మహిళల సంక్షేమానికి ఉపయోగిస్తుంది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఆట ఆడలేమా..?
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
ముద్రగడ సవాల్
అమ్మకు ఏమైంది?
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
తెలంగాణ 3300 కోట్లు పాయె
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
అమ్మ పరిస్థితి ఏంటి?
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
బాబుకు గడ్డి పెడదాం
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
నరేంద్రమోదీ@50 రోజులు
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments