మా టీవీ లైసెన్స్ లు రద్దు

Maa Networks License cancelled

తెలుగు మీడియాలో ‘మా’ మీడియాకు ఎంతో ఆదరణ ఉంది. ఏపిలో, తెలంగాణలో కూడా ఈ మీడియాకు, ముఖ్యంగా ఆ ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రతి ఒక్క తెలుగు వారికి తెలిసిందే. అయితే తాజాగా మా టీవీ నెట్ వర్క్స్ లైసెన్స్  రెన్యువల్ కు కేంద్రం అడ్డుకట్టవేసింది. అవును.. మా టీవీ నెట్ వర్స్ కింద నాలుగు ఛానల్స్ ఉన్నాయి. మాటీవీ, మా మ్యూజిక్, మాగోల్డ్, మా మూవీస్ లైసెన్స్ లను పునరుద్దరించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఇంతకీ కేంద్రం ఎందుకు లైసెన్స్ రినివల్ కు నిరాకరించిందో తెలుసా..?

మా సంస్థ డైరెక్టర్‌ నిమ్మగడ్డ ప్రసాద్ పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో..నేరస్థులు లేదా అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి మీడియా సంస్థలను నడిపించే అవకాశం కల్పించకూడదు అని కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా మా టీవీ ఛానల్స్ ను హిందీలో పాపులర్ అయిన స్టార్ గ్రూప్ సంస్థ గతంలోనే కొనుగోలు చేసింది.మా నెట్ వర్క్స్ లైసెన్స్ రద్దు తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ ముందు, స్టార్ గ్రూప్ సంస్థ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి నిమ్మగడ్డ ప్రసాద్ బోర్డ్ మెంబర్ గా వైదొలగడం, రెండోది స్టార్ గ్రూప్ యాజమాన్య హక్కులను సొంతం చేసుకోవడం

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
జగన్ అన్న.. సొంత అన్న
సన్మానం చేయించుకున్న వెంకయ్య
జియోకే షాకిచ్చే ఆఫర్లు
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
తెలంగాణ 3300 కోట్లు పాయె
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తిరిగిరాని లోకాలకు జయ
జయ మరణం ముందే తెలుసా?
బాబును వదిలేదిలేదు
బాబుకు గడ్డి పెడదాం
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
దేశభక్తి అంటే ఇదేనా?
బంగారం బట్టబయలు చేస్తారా?
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
ఏపికి యనమల షాకు

Comments

comments