జయ మరణం వెనక ఆ మాఫియా?

Mafia on Tamilnadu CM Jayalalitha death

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. తమిళనాట కీలకపరిణామాలకు కేంద్ర బిందువుగా మారిన అపోలో ఆస్పత్రిలో ఏం జరిగింది? తమిళనాడులో ఏం జరుగుతోందో? దిల్లీలోని పెద్దలకు ముందే తెలుసా? అన్నీ తెలిసినా బయటకు ఎక్కడా విషయం బయటకు రాకుండా సైలెన్స్ మెంటెయిన్ చేశారా? అనే అనుమానాలు అంతకంతకు బలపడుతున్నాయి. తాజాగా తెహెల్కా లో వచ్చిన కథనం జయలలితది అసాధారణ మరణం అని వార్తా కథనాన్ని ప్రచురించడం ఇప్పుడు వార్తల్లో ట్రెండ్ అవుతోంది. అయితే తెహెల్కా ప్రచురించిన కథనం ఇప్పుడు తమిళనాడు నుండి దిల్లీ వరకు ప్రకంపనలు పుట్టిస్తోంది. అసలు తెహెల్కా జయలలిత మరణానికి సంబంధించిన ఏ విషయాలను బయటపెట్టిందో తెలుసా?

జయలలిత మరణంతో తమిళనాట కోట్ల మంది దు:ఖసాగరంలో మునిగిపోయారు. అయితే జయ నిష్ర్ర్కమణ తర్వాత తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. తమిళనాట జరుగుతున్న పరిణామాలపై దిల్లీలో కూడా చర్చలు సాగుతున్నాయంటే అక్కడ పరిస్థితులు ఎంత వాడివేడిగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి జయ మరణం ముందే తెలుసు అని సంచలనానికి తెర తీసింది తెహెల్కా.

తమిళనాడు అధినేత్రి జయలలితకు శశికళ నియమించిన నర్సు నిద్రమాత్రలు, కొద్దిమోతాదులో విషం కలిగిన రసాయనాలను ఇచ్చిందని తెహెల్కా ఓ కథనం రాసింది. అవును… మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం. జయలలిత మరణం మీద ఇప్పటికే అందరికి చాలా అనుమానాలున్నాయి. అలోపోలో జయలలిత చికిత్స సమయంలో ఎవరిని లోపలికి అనుమతించకపోవడం, అపోలో విచిత్ర ప్రకటన నేపథ్యంలో తెహెల్కా కథనం ఇప్పుడు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడులో ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్న జయలలిత నిచ్చెలి శశికళ జయ మరణంలో కూడా శశికళ సూత్రధారి అని తెహెల్కా తేల్చేసింది. అమ్మ స్థానంలో చిన్నమ్మను గద్దెనెక్కించేందుకు మన్నార్‌గుడి మాఫియా కుట్రలు పన్నిందని సూటిగా పేర్కొన్నది. జయకు అంత్యక్రియలు నిర్వహించి ఉత్తరాధికారిగా ముందుకు వచ్చిన శశికళ రాజకీయ భవితవ్యంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తెహెల్కా ఈ బాంబును పేల్చింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంతిమతీర్పును ఎదుర్కొనేందుకు జయ బెంగళూరుకు పయనమవుతున్నప్పుడు మన్నార్‌గుడి మాఫియాకు ఈ ఐడియా వచ్చిందని తెహెల్కా పేర్కొన్నది.

అయితే ఇక్కడ మరో కోణం కూడా తెహెల్కా వెల్లడించింది. జయకు దగ్గరి వ్యక్తుల నుండి ప్రమాదం ఉందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో గుజరాత్ సిఎంగా ఉన్న నరేంద్ర మోదీ హెచ్చరించారని తెహెల్కా తెలిపింది. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల వసూళ్లకు దడిసి పెద్ద ఇన్వెస్టర్లు తమిళనాడుకు మొఖం చాటేస్తున్నారని మోదీ జయకు చెప్పారట. జయకు దగ్గరగా ఉన్న వారిపై ఓ కన్నేసి ఉంచాలని మోదీ సూచించారట. ఆ తర్వాతే చెన్నై మోనోరైల్ ప్రాజెక్టు వ్యవహారంలో శశికళ వెనుకనుంచి నడిపించిన తతంగం జయ దృష్టికి వచ్చిందని తెహెల్కా రాసింది. చివరికి తన సంతకం కూడా ఫోర్జరీ అయినట్టు తెలుసుకుని జయ ఆగ్రహించి నిలదీస్తే శశికళ తనకేమీ తెలియదని అమాయకత్వం నటించారని తెలిపింది.

ఆ తర్వాత మరో హెచ్చరిక తర్వాత శశికళ నియమించిన నర్సు తనకు ఇస్తున్న మందులపై స్వతంత్ర వైద్య నివేదిక తెప్పించుకున్నారు. తనకిస్తున్నవి నిద్రపుచ్చే మందులని, కొద్దిమోతాదులో విషం కలిగిన రసాయనాలని అందులో ఉండటంతో జయ వేగంగా కదిలారని, మన్నార్‌గుడి మాఫియాను పక్కనపెట్టిందని తెలిపింది. దాంతో ఈ వివాదం కాస్తా జయ వర్సెస్ శశికళగా మారిందని వెల్లడించింది. చాలా పరిణామాల తర్వాత శశికళ జయకు మరోసారి దగ్గరయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన జయ మృత్యువుతో హోరాహోరీ పోరాడి అంతిమశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తెహెల్కా కథనం సంచలనం సృష్టిస్తున్నది.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ఉక్కిరిబిక్కిరి
చంద్రుడి మాయ Diversion Master
టాప్ గేర్ లో ముద్రగడ
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
వెనకడుగు
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments