యుపీలో ఘోర రైలు ప్రమాదం

Major Train accident in UttarPradesh

మరోసారి వార్తల్లో రైల్వే ప్రమాదం హెల్ లైన్ గా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 125 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్‌ పూర్‌ దేహత్‌ జిల్లా పుఖ్రాయాన్‌ దగ్గర పాట్నా నుండి ఇండోర్‌ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు.

రైల్వే ప్రమాదం పై స్పందించారు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.  మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ కూడా మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయచర్యలు చేపట్టేందుకు వారణాసి, లఖ్‌నవూ నుంచి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  దాదాపు 250 మంది పోలీసులు ప్రమాదస్థలి దగ్గర రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన రైలుకు చెందిన 12 బోగీలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి ట్రాక్ పై నుంచి తొలిగించారు.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఆరిపోయే దీపంలా టిడిపి?
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
జియోకే షాకిచ్చే ఆఫర్లు
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
అకౌంట్లో పదివేలు వస్తాయా?
BSNL లాభం ఎంతో తెలుసా?
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments