మావో నాయకుడు ఆర్కే క్షేమం

Mao leader RK is safe

ఏపిలో తీవ్ర కలకలానికి కారణమైన మావోయిస్టు నాయకుడు ఆర్కే అదృశ్యం మీద మొత్తానికి ఓ క్లారిటీ దొరికింది. ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది మావోలను అంతం చేసిన పోలీసులు, ఆర్కేను మాయం చేశారని హైకోర్టులో పిటిషన్ వేశారు ఆర్కే భార్య. కాగా ఆర్కే అదృశ్యం అయ్యారు అంతేగానీ తమకు దీనికి ఎలాంటి సంబంధంలేదు అని పోలీసులు వెల్లడించారు. కానీ పోలీసులు దీనిపై వెంటనే కోర్టుకు స్పష్టమైన సమాచారం అందించాలని తీర్పునిచ్చింది. కాగా ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారా..? లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన్ని ఎన్ కౌంటర్ లో చంపేశారా..? అనే అనుమానాలు కలుగాయి.

కాగా తాజాగా ఆర్కే అదృశ్యం మీద విరసం నేత వరవరరావు క్లారిటీ ఇచ్చారు. నిన్నటి దాకా మొత్తం పోలీసులే చేశారు అని ఆరోపించిన ఆయన తాజాగా ఆర్కే క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా ఆర్కే క్షేమ సమాచారాన్ని అందజేసినట్లు వివరించారు. కాగా అంతకు ముందు ఏపి సర్కార్ మీద ఆర్కే అదృశ్యం మీద తీవ్ర వత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఆర్కే క్షేమంగా ఉన్నారు అన్న వార్త కాస్త రిలీఫ్ కలిగిస్తోంది.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
గుజరాత్ సిఎం రాజీనామా
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఏపీ బంద్.. హోదా కోసం
ఈ SAM ఏంటి గురూ..?
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
అంత దైర్యం ఎక్కడిది..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
బినామీలు భయపడే మోదీ ప్లాన్
BSNL లాభం ఎంతో తెలుసా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
బస్సుల కోసం బుస్..బుస్

Comments

comments