మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?

Maoists letter is true or not

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి మావోల మీద విరుచుకుపడ్డారా? మావోలను హతమార్చడం వెనక చంద్రబాబు నాయుడు హస్తం రాజకీయ కోణంలో ఉందా అనే అనుమానాలకు తెర తీస్తోంది. గతంలో మావోయిస్టుల చేతిలో తృటిలో తప్పించుకున్న నారా చంద్రబాబు నాయుడు మరోసారి వారి నుండి ముప్పు ఉందా..? మావోలు చంద్రబాబు కుటుంబానికి హాని కలిగిస్తారా? అనే ప్రశ్నలకు మావోల లేఖ తెర తీసింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో  31 మంది మావోలు హతమయ్యారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగింది.

నారా చంద్రబాబు నాయుడు కావాలని మావోలను విషం పెట్టి చంపి, తర్వాత ఎన్ కౌంటర్ జరిగినట్లు చిత్రీకరించినట్లు విరసం నేతలు వాదిస్తున్నారు. ఎన్ కౌంటర్ తర్వాత మావోల పేరుతో వచ్చిన ఓ లేఖ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చంద్రబాబు నాయుడు జరిపించిన ఎన్ కౌంటర్ కు ప్రతిఫలం చెల్లింకతప్పదు అని, అవసరమైతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడతామని ఆ లేఖలో ఉంది. అయితే ఈ లేఖలో నారా లోకేష్ పేరు కూడా ఉంది.

మావోల పేరుతో వచ్చిన లేఖ అంతా నాటకం అని విరసం నేతలు అంటున్నారు. ప్రజా ఉద్యమంలో ఉన్న మావోలు ఎప్పుడైనా ఆత్మాహుతి దాడులకు పాల్పడరు అని, కేవలం దాడులు మాత్రమే చేస్తారని విరసం వాదన. ఇది చంద్రబాబు నాయుడు సృష్టించిన లేఖనే అని, తన కొడుకు నారా లోకేష్ కు జడ్ కేటగిరి భద్రత కోసం ఇలా నాటకాలాడుతున్నారు అని వాదన. కాగా నారా లోకేష్ కు జెడ్ క్యాటగిరీ భద్రత ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొన్నమధ్యన టైమ్స్ సౌ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి జెడ్ క్యాటగిరీ కేటాయిస్తేనే దేశం మొత్తం విమర్శలకు దిగింది. ప్రజా ధనాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారని ప్రశ్నించారు. మరి చిన్నబాబుకు జెడ్ క్యాటగిరీ కేటాయించాల్సి వస్తుంది అనే వార్త తెలిస్తే మాత్రం సోషల్ మీడియాలో కడిగిపారేయడం ఖాయం.

Related posts:
కాటేసిందని పాముకు శిక్ష
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
నయీం బాధితుల ‘క్యూ’
వాళ్లను వదిలేదిలేదు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
బాబు బిత్తరపోవాల్సిందే..
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బిచ్చగాళ్లు కావలెను
మోదీ హీరో కాదా?
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు

Comments

comments